నిర్మల్ బొమ్మల నేపథ్యంలో...
ABN , First Publish Date - 2020-12-21T07:06:40+05:30 IST
‘ఢమరుకం’ ఫేమ్ శ్రీనివాసరెడ్డి స్ర్కీన్‌ప్లే, దర్శకత్వ పర్యవేక్షణలో రూపొందుతున్న చిత్రం ‘రాధాకృష్ణ’. అనురాగ్, ముస్కాన్...

‘ఢమరుకం’ ఫేమ్ శ్రీనివాసరెడ్డి స్ర్కీన్‌ప్లే, దర్శకత్వ పర్యవేక్షణలో రూపొందుతున్న చిత్రం ‘రాధాకృష్ణ’. అనురాగ్, ముస్కాన్ ేసథీ జంటగా నటిస్తున్నారు. టి.డి.ప్రసాద్ వర్మ దర్శకుడు. మంతెన నరసింహరాజు సమర్పణలో హరిణి ఆరాధ్య క్రియేషన్స్ పతాకంపై పుప్పాల సాగరిక నిర్మిస్తున్నారు. లక్ష్మీపార్వతి ఈ చిత్రంలో కీలక పాత్ర పోషించడం విశేషం. ఎం.ఎం.శ్రీలేఖ సంగీతం అందించిన ఈ చిత్రం పాటల్ని శనివారం టీటీడీ ఛైర్మన్ వై.వి.సుబ్బారెడ్డి విడుదల చేశారు. దర్శకుడు మాట్లాడుతూ ‘‘నిర్మల్ బొమ్మలు తయారుచేేస కళాకారులు, వారు పడుతున్న ఇబ్బందుల నేపథ్యంలో తెరకెక్కించిన చిత్రమిది. ఇందులో చక్కని ప్రేమకథ కూడా ఉంది’’ అని చెప్పారు. ‘‘జనవరిలో సినిమాను విడుదల చేస్తాం’’ అని నిర్మాత అన్నారు. ‘‘ఇందులో ఐదు చక్కని పాటలున్నాయి. త్వరలో మిగిలిన మూడు పాటల్ని విడుదల చేస్తాం’’ అని శ్రీలేఖ అన్నారు. అలీ, అనురాగ్, ముస్కాన్‌సేథీ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
Read more