సుశాంత్ మృతి కేసు: బీహార్ పోలీసులు వర్సెస్ ముంబై పోలీసులు

ABN , First Publish Date - 2020-08-02T04:32:21+05:30 IST

సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మృతి కేసు రోజుకో మలుపు తిరుగుతుంది. ఇప్పుడీ కేసుని కొందరు రాజకీయ నాయకులు రాజకీయ లబ్ధి కోసం వాడుకోవాలని

సుశాంత్ మృతి కేసు: బీహార్ పోలీసులు వర్సెస్ ముంబై పోలీసులు

సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మృతి కేసు రోజుకో మలుపు తిరుగుతుంది. ఇప్పుడీ కేసుని కొందరు రాజకీయ నాయకులు రాజకీయ లబ్ధి కోసం వాడుకోవాలని చూస్తున్నారు. ముంబై పోలీసులు కేసును ఆత్మహత్య అంటూ క్లోజ్ చేసే ప్రయత్నాలు చేస్తుండటంతో.. సుశాంత్ జన్మస్థలమైన బీహార్ పోలీసులు రంగంలోకి దిగారు. అన్ని కోణాల్లో నుంచి ఈ కేసును పరిశీలిస్తున్నారు. అయితే బీహార్ పోలీసులకు ముంబై పోలీసులు అడ్డుపడుతున్నారనే వాదనలు బాగా వినిపిస్తున్నాయి. దీనికి సంబంధించిన వీడియో కూడా ఒకటి నెట్టింట్లో వైరల్ అవుతుంది.

 

సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణ కేసును దర్యాప్తు చేయడానికి ముంబైకి వచ్చిన బీహార్ పోలీసులను ముంబై పోలీసులు వ్యాన్‌లోకి ఎక్కిస్తున్నట్లుగా ఆన్‌లైన్‌లో ఓ వీడియో వైరల్ అవుతుంది. బీహార్ పోలీసు అధికారిని వ్యాన్ వద్దకు తీసుకెళ్లేటప్పుడు అతను మీడియాతో మాట్లాడటానికి ప్రయత్నిస్తున్నట్లు ఈ వీడియోలో కనిపించింది. అయితే దీనికి ముంబై పోలీసులు ఇస్తున్న వివరణ మాత్రం వేరేలా ఉంది. మీడియా నుండి బీహార్ పోలీసులను రక్షించడానికే అలా చేశామని చెబుతున్నారు ముంబై పోలీసులు. దీంతో ముంబైలో సుశాంత్ కేసు విషయమై ఏదో శక్తి గట్టిగా అడ్డుపడుతుందని, ఆ శక్తిని బయటికి లాగి, సుశాంత్‌ మృతికి న్యాయం చేయాలని కోరుతూ.. అభిమానులు సోషల్ మీడియాని హోరెత్తిస్తున్నారు.  

Updated Date - 2020-08-02T04:32:21+05:30 IST