అరవై రోజుల్లో...

ABN , First Publish Date - 2020-09-16T06:44:50+05:30 IST

ప్రభాస్‌ కథానాయకుడిగా నటించనున్న చిత్రం ‘ఆదిపురుష్‌’. రామాయణం స్ఫూర్తితో తెలుగు, హిందీ భాషల్లో 3డీలో రూపొందించనున్నారు. హిందీ హిట్‌ ‘తానాజీ’ ఫేమ్‌ ఓం రౌత్‌ దర్శకత్వం...

అరవై రోజుల్లో...

ప్రభాస్‌ కథానాయకుడిగా నటించనున్న చిత్రం ‘ఆదిపురుష్‌’. రామాయణం స్ఫూర్తితో తెలుగు, హిందీ భాషల్లో 3డీలో రూపొందించనున్నారు. హిందీ హిట్‌ ‘తానాజీ’ ఫేమ్‌ ఓం రౌత్‌ దర్శకత్వం వహించనున్నారు. వచ్చే ఏడాది జనవరిలో చిత్రీకరణ ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తున్నారు. ‘బాహుబలి’ రెండు భాగాలు, ‘సాహో’తో పోలిస్తే... అతి తక్కువ షూటింగ్‌ డేస్‌లో ‘ఆదిపురుష్‌’ పూర్తవుతుందని తెలుస్తోంది. ఈ చిత్రానికి ప్రభాస్‌ కేవలం 60 రోజులు మాత్రమే కేటాయించారట. రెండు నెలల సమయంలో ఆయన పాత్రకు సంబంధించిన చిత్రీకరణ పూర్తవుతుందని యూనిట్‌ వర్గాల సమాచారం. మైథలాజికల్‌ ఫాంటసీ ఫిల్మ్‌ కావడంతో ముంబైలోని ఓ స్టూడియోలో గ్రీన్‌ మ్యాట్‌లో ఎక్కువ శాతం చిత్రాన్ని తెరకెక్కించి, తర్వాత వీఎఫ్‌ఎక్స్‌ పనుల మీద దృష్టి సారించాలనుకుంటున్నారు. చిత్రీకరణ కంటే వీఎఫ్‌ఎక్స్‌ పనులకు ఎక్కువ రోజులు అవసరం అవుతాయట. ప్రభు రామ్‌ (శ్రీరాముడు) పాత్రలో ప్రభాస్‌ నటించనున్న ఈ చిత్రంలో లంకేశ్‌ (రావణుడు) పాత్రను బాలీవుడ్‌ నటుడు సైఫ్‌ అలీ ఖాన్‌ పోషించనున్నారు.


అనుష్కా శర్మ... సీత కాదు!

‘ఆదిపురుష్‌’లో సీతగా అనుష్కా శర్మ నటించే అవకాశాలు ఉన్నాయని వార్తలొచ్చాయి. వాటిని ఆమె సన్నిహిత వర్గాలు సున్నితంగా తోసిపుచ్చాయి. వచ్చే ఏడాది జనవరిలో బిడ్డకు జన్మనివ్వనున్నట్టు అనుష్క ప్రకటించిన సంగతి తెలిసిందే. డెలివరీ అయిన మూడు నెలల తర్వాత ఏప్రిల్‌లో చిత్రీకరణ ప్రారంభించాలని అనుష్క అనుకుంటున్నారట. అయితే... ఆమె చేయబోయే సినిమాలో జాబితాలో ‘ఆదిపురుష్‌’ లేదట. ఇప్పటివరకూ ఈ చిత్రానికి సంబంధించి ఆమెతో చర్చలు జరగనే లేదట.

Updated Date - 2020-09-16T06:44:50+05:30 IST