టూకీగా...

ABN , First Publish Date - 2020-08-27T05:32:46+05:30 IST

జర్నలిస్ట్‌ ప్రభు దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘రాంగ్‌గోపాల్‌వర్మ’. షకలక శంకర్‌ టైటిల్‌ పాత్ర పోషిస్తున్న ఈ చిత్రం టైటిల్‌ లోగోను ప్రముఖ మహిళాభ్యుదయవాది దేవి ఆవిష్కరించారు...

టూకీగా...

జర్నలిస్ట్‌ ప్రభు దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘రాంగ్‌గోపాల్‌వర్మ’. షకలక శంకర్‌ టైటిల్‌ పాత్ర పోషిస్తున్న ఈ చిత్రం టైటిల్‌ లోగోను ప్రముఖ మహిళాభ్యుదయవాది దేవి ఆవిష్కరించారు. ఈ చిత్రం పోస్టర్‌ను మరో మహిళాభ్యుదయవాది సంధ్య రిలీజ్‌ చేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. ‘‘మహిళల పట్ల చాలా చిన్నచూపు కలిగిన ఓ దర్శకుడి చేష్టలు ఎండగడుతూ సీనియర్‌ జర్నలిస్ట్‌ ప్రభు రూపొందిస్తున్న ‘రాంగ్‌గోపాల్‌వర్మ’ చిత్రాన్ని నేను స్వాగతిస్తున్నాను’’ అన్నారు. ఓ ప్రముఖ దర్శకుడి విపరీత చేష్టలతో విసిగిపోయి తాను ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నానని... షూటింగ్‌ పూర్తిచేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ జరుపుకుంటోందని, ఈ చిత్రం కోసం తాను రాసిన ‘వర్మా వర్మా వర్మా.. ఓ రాంగ్‌ గోపాల్‌ వర్మ... ఇలా కాలింది ఏమిటయ్యా మా ఖర్మ’ అనే పాట ఓ ప్రముఖ ఆడియో కంపెనీ ద్వారా త్వరలో రిలీజ్‌ అవుతుందని రచయిత, దర్శక నిర్మాత ప్రభు తెలిపారు. 


మానస్‌ నాగులపల్లి, సంజయ్‌కుమార్‌ హీరోలుగా అనిల్‌ వంగలూరి దర్శకత్వంలో రూపొందుతున్న ‘క్షీరసాగర మథనం’ చిత్రం టీజర్‌కు విశేష స్పందన వస్తోందని నిర్మాతలు చెప్పారు. ఏడు పాత్రల భావోద్వేగాలను తెరకెక్కిస్తున్న ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని విడుదలకు సిద్ధమైంది.

Updated Date - 2020-08-27T05:32:46+05:30 IST