సేవలో... సినీ గణం
ABN , First Publish Date - 2020-04-16T09:55:54+05:30 IST
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్‌ఎంసీ) ప్రధాన కార్యాలయంలో పారిశుద్థ్య కార్మికులకు నిర్మాత ‘దిల్’ రాజు శానిటైజర్లు, మాస్కులు పంపిణీ చేశారు...

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్‌ఎంసీ) ప్రధాన కార్యాలయంలో పారిశుద్థ్య కార్మికులకు నిర్మాత ‘దిల్’ రాజు శానిటైజర్లు, మాస్కులు పంపిణీ చేశారు.
పోలీస్ బందోబస్త్ మధ్య హైదరాబాద్, యూసఫ్‌గూడలోని కృష్ణకాంత్ పార్కు దగ్గర హీరో శ్రీకాంత్ ఆధ్వర్యంలో 500మందికి బుధవారం మధ్యాహ్నం భోజనం ఏర్పాటు చేశారు. పలువురికి ఫుడ్ ప్యాకెట్లు అందించారు.
తూర్పు గోదావరి జిల్లాలో ఇబ్బందులు ఎద్కొంటున్న 200 మంది జూనియర్ ఆర్టిస్టులకు నటుడు గౌతమ్‌రాజు ఆర్థిక సహాయం చేశారు.
కరోనా కాటుకు ఇబ్బందులు పడుతున్న అరటి, బత్తాయి. నిమ్మ, జామ రైతుల దగ్గర పళ్లు కొనుగోలు చేసి తినడం ద్వారా వాళ్లకు సాయం చేసి కాపాడుకుందామని నటుడు సాయికుమార్ పిలుపునిచ్చారు.
Read more