రంపచోడవరంలో...

ABN , First Publish Date - 2020-10-09T05:07:13+05:30 IST

అల్లు అర్జున్‌ తాజా చిత్రం ‘పుష్ప’ షూటింగ్‌ లొకేషన్‌ ఫైనలైజ్‌ అయింది. నవంబర్‌ 2 నుంచి నెల రోజుల పాటు రంపచోడవరం, మారేడిమిల్లి అడవుల్లో ఈ చిత్రం షూటింగ్‌...

రంపచోడవరంలో...

అల్లు అర్జున్‌ తాజా చిత్రం ‘పుష్ప’ షూటింగ్‌ లొకేషన్‌ ఫైనలైజ్‌ అయింది. నవంబర్‌ 2 నుంచి నెల రోజుల పాటు రంపచోడవరం, మారేడిమిల్లి అడవుల్లో ఈ చిత్రం షూటింగ్‌  జరుగుతుంది. సుకుమార్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రకథ అడవి  నేపథ్యంలో జరుగుతుంది కనుక మొదట కేరళ అడవుల్లో షూటింగ్‌ చేయాలనుకొన్నారు. అయితే కరోనా కారణంగా అది వాయిదా పడింది. తర్వాత రంపచోడవరం, మారేడుమిల్లి అడవుల్లో షూటింగ్‌ చేయడానికి ప్లాన్‌ చేశారు. కాకపోతే  కరోనా సమయంలో అంతదూరం వెళ్లి షూటింగ్‌ చేయడం శ్రేయస్కరం కాదేమోననుకొని, ఓ దశలో కొంతవరకూ కాంప్రమైజ్‌ అయి, వికరాబాద్‌ అడవుల్లో షూటింగ్‌ చేయాలని కూడా  ఆలోచించారు. ఇంతలోనే  కరోనా కొంత తగ్గుముఖం పట్టడం, సినిమా షూటింగ్స్‌ తిరిగి ప్రారంభవమవుతుండడంతో మొదట అనుకొన్న ప్రకారం కేరళలోనే షూటింగ్‌ చేయడానికి యూనిట్‌ సిద్ధమైంది. అయితే ఇప్పటికీ కేరళలో కరోనా ప్రభావం తీవ్రస్థాయిలో ఉండడంతో చివరి క్షణంలో  వెనక్కి తగ్గి. రంపచోడవరం వెళ్లడానికి దర్శకనిర్మాతలు ఫిక్స్‌ అయ్యారు. అక్కడ ఒక షెడ్యూల్‌ చేసిన తర్వాత, కేరళ వెళ్లాలని వారి ప్లాన్‌. నెల రోజుల పాటు రంపచోడవరం, మారేడిమిల్లి అడవుల్లో యాక్షన్‌ పార్ట్‌, హీరోహీరోయిన్లు పాల్గొనే కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తారు. రష్మిక కథానాయికగా నటిస్తున్న ‘పుష్ప’ చిత్రాన్ని నవీన్‌ ఎర్నేని, రవిశంకర్‌ యలమంచి నిర్మిస్తున్నారు.

Updated Date - 2020-10-09T05:07:13+05:30 IST