రియా చక్రవర్తి ప్రేమలో...

ABN , First Publish Date - 2020-06-16T06:09:40+05:30 IST

నటి రియా చక్రవర్తితో సుశాంత్‌ ప్రేమలో ఉన్నారనీ, ఈ ఏడాది నవంబర్‌లో వీరి వివాహం జరుగుతుందని ప్రచారం జరిగింది. లాక్‌ డౌన్‌ సమయంలో సుశాంత్‌, రియా ఒకే చోట కలిసే ఉన్నారనీ...

రియా చక్రవర్తి ప్రేమలో...

నటి రియా చక్రవర్తితో సుశాంత్‌ ప్రేమలో ఉన్నారనీ, ఈ ఏడాది నవంబర్‌లో వీరి వివాహం జరుగుతుందని ప్రచారం జరిగింది. లాక్‌ డౌన్‌ సమయంలో సుశాంత్‌, రియా ఒకే చోట కలిసే ఉన్నారనీ, తను ఆత్మహత్య చేసుకోవడానికి ఒక రోజు ముందు ఆమెను వాళ్లింటికి సుశాంత్‌ పంపేశాడనీ ముంబై పత్రికల కథనం. రియా చక్రవర్తి ‘తూనీగ తూనీగ’ చిత్రంతో కథానాయికగా తెలుగు చిత్రరంగానికి పరిచయమయ్యారు. ఆ తర్వాత పలు హిందీ చిత్రాల్లో ఆమె నటించారు. సుశాంత్‌తో ఉన్న అనుబంధం గురించి, అతను ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణాల గురించి రియా చక్రవర్తిని పోలీసులు ప్రశ్నించనున్నారు. కుటుంబ సభ్యులు, సినీ, టీవీ రంగాల తారల సమక్షంలో సోమవారం సుశాంత్‌ అంత్యక్రియలు జరిగాయి.


Updated Date - 2020-06-16T06:09:40+05:30 IST