నాలుగు భాషల్లో...

ABN , First Publish Date - 2020-10-09T05:02:25+05:30 IST

బాలాదిత్యా, అర్చన జంటగా నటించిన చిత్రం ‘అన్నపూర్ణమ్మ గారి మనవడు’. మాస్టర్‌ రవితేజ టైటిల్‌ పాత్రలో, అన్నపూర్ణ, జమున కీలక పాత్రల్లో కనిపిస్తారు...

నాలుగు భాషల్లో...

బాలాదిత్యా, అర్చన జంటగా నటించిన చిత్రం ‘అన్నపూర్ణమ్మ గారి మనవడు’. మాస్టర్‌ రవితేజ టైటిల్‌ పాత్రలో, అన్నపూర్ణ, జమున కీలక పాత్రల్లో కనిపిస్తారు. శివనాగు దర్శకుడు. చిత్రీకరణ, నిర్మాణానంతర కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమాను తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో ఓటీటీ వేదికగా విడుదల చేయడానికి నిర్మాత ఎం.ఎన్‌.ఆర్‌ చౌదరి ప్లాన్‌ చేస్తున్నారు. ఆయన మాట్లాడుతూ ‘‘ప్రేమానురాగాలు ఇతివృత్తంగా రూపొందిన చిత్రమిది. అమరావతి, అమలాపురం, అన్నవరం లాంటి కనువిందైన ప్రదేశాల్లో చిత్రీకరణ చేశాం. తొలి కాపీ సిద్ధమైంది. త్వరలో సెన్సార్‌ కార్యక్రమాలు పూర్తి చేసి విడుదల చేస్తాం’’ అని అన్నారు.

Updated Date - 2020-10-09T05:02:25+05:30 IST