కొత్త పాత్రలో!

ABN , First Publish Date - 2020-08-27T05:38:16+05:30 IST

‘కె.జి.యఫ్‌: ఛాప్టర్‌1’లో జర్నలిస్ట్‌ ఆనంద్‌ వాసిరాజు పాత్రలో అనంత్‌ నాగ్‌ నటించారు. సీక్వెల్‌లో ఆయనను తప్పించి, ఆ పాత్రను ప్రకాశ్‌రాజ్‌తో చేయిస్తున్నట్టు వార్తలొచ్చాయి...

కొత్త పాత్రలో!

‘కె.జి.యఫ్‌: ఛాప్టర్‌1’లో జర్నలిస్ట్‌ ఆనంద్‌ వాసిరాజు పాత్రలో అనంత్‌ నాగ్‌ నటించారు. సీక్వెల్‌లో ఆయనను తప్పించి, ఆ పాత్రను ప్రకాశ్‌రాజ్‌తో చేయిస్తున్నట్టు వార్తలొచ్చాయి. యశ్‌ హీరోగా నటిస్తున్న ఈ సినిమా చిత్రీకరణ బుధవారం బెంగళూరులోని కంఠీరవ స్టూడియోస్‌లో మొదలైంది. ‘‘ప్రకాశ్‌రాజ్‌గారికి స్వాగతం. ఫైనల్లీ... ‘కె.జి.యఫ్‌: ఛాప్టర్‌ 2’ చిత్రీకరణ ప్రారంభించాం’’ అని దర్శకుడు ప్రశాంత్‌ నీల్‌ ట్వీట్‌ చేశారు. ‘‘స్టార్ట్‌ కెమెరా యాక్షన్‌... బ్యాక్‌ టు వర్క్‌’’ అని ప్రకాశ్‌రాజ్‌ పేర్కొన్నారు. ఈ సందర్భంగా విడుదల చేసిన వర్కింగ్‌ స్టిల్స్‌లో ప్రకాశ్‌రాజ్‌ను చూస్తే... ఆయన ఆహార్యం అనంత్‌నాగ్‌ను తలపించింది. అయితే, ‘‘అనంత్‌నాగ్‌కి ప్రకాశ్‌రాజ్‌ రీప్లేస్‌మెంట్‌ కాదు. సినిమాలో ఆయన కొత్తగా ప్రవేశించారు. ఆయనది కొత్త పాత్ర’’ అని దర్శకుడు స్పష్టం చేశారు.  కేంద్ర ప్రభుత్వం అనుమతులు ఇచ్చిన తర్వాత దక్షిణాదిలో చిత్రీకరణ ప్రారంభించిన భారీ చిత్రమిదే. ఇందులో ప్రతినాయకుడు అధీరా పాత్రలో సంజయ్‌దత్‌ నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల ఆయన క్యాన్సర్‌ బారిన పడటంతో ఆయన సన్నివేశాలు మినహా మిగతావి పూర్తి చేయాలని దర్శక, నిర్మాతలు భావిస్తున్నారట.

Updated Date - 2020-08-27T05:38:16+05:30 IST