ఇలియానా... స్ర్కిప్ట్‌... ఆన్‌లైన్‌

ABN , First Publish Date - 2020-10-30T07:23:01+05:30 IST

ఇలియానా, రణ్‌దీ్‌పహుడా జంటగా తెరకెక్కుతోన్న చిత్రం ‘అన్‌ఫెయిర్‌ అండ్‌ లవ్‌లీ’. త్వరలోనే ఈ చిత్రం సెట్స్‌పైకి వెళ్లనుండడంతో...

ఇలియానా... స్ర్కిప్ట్‌... ఆన్‌లైన్‌

ఇలియానా, రణ్‌దీ్‌పహుడా జంటగా తెరకెక్కుతోన్న చిత్రం ‘అన్‌ఫెయిర్‌ అండ్‌ లవ్‌లీ’. త్వరలోనే ఈ చిత్రం సెట్స్‌పైకి వెళ్లనుండడంతో ఇలియానా, రణ్‌దీ్‌ప షూటింగు కోసం సన్నద్ధమవుతున్నారు. వీడియోకాల్‌లో జరిగిన స్ర్కిప్ట్‌ రీడింగ్‌ సెషన్‌లో వారిద్దరూ ఒకరితో ఒకరు కనెక్ట్‌ అయ్యి స్ర్కిప్ట్‌ చదివారు. ఆ ఫొటోలను ఇలియానా ఇన్‌స్టా వేదికగా అభిమానులతో పంచుకున్నారు. అలాగే షూటింగ్‌లో పాల్గొనే ముందు కొవిడ్‌ పరీక్ష చేయించుకున్నట్టు రణ్‌దీప్‌ తెలిపారు. బల్వీందర్‌సింగ్‌ జంజ్వూ దర్శకత్వంలో సోనీ పిక్చర్స్‌ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఈ సినిమాతో పాటు అభిషేక్‌బచ్చన్‌ సరసన ‘ద బిగ్‌ బుల్‌’ చిత్రంలో కూడా ఇలియానా నటిస్తున్నారు.

Updated Date - 2020-10-30T07:23:01+05:30 IST