పూలు పెట్టుకున్నాను.. ప్యాంట్ వేసుకోలేదు: ఇలియానా

ABN , First Publish Date - 2020-04-16T15:01:56+05:30 IST

సినిమా అవకాశాల కోసమో, తమలోని గ్లామర్‌ను పరిచయం చేసేందుకో.. అన్ని భాషల హీరోయిన్లు రెగ్యులర్‌గా ఫొటోషూట్లలో పాల్గొంటుంటారు.

పూలు పెట్టుకున్నాను.. ప్యాంట్ వేసుకోలేదు: ఇలియానా

సినిమా అవకాశాల కోసమో, తమలోని గ్లామర్‌ను పరిచయం చేసేందుకో.. అన్ని భాషల హీరోయిన్లు రెగ్యులర్‌గా ఫొటోషూట్లలో పాల్గొంటుంటారు. వాటిని సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంటుంటారు. అయితే కరోనా వీటన్నింటికీ బ్రేక్ వేసింది. అయినా వెనకడుగు వేయకుండా తమ పాత హాట్ ఫొటోలను షేర్ చేస్తూ అభిమానులను కొందరు హీరోయిన్లు అలరిస్తున్నారు. 


గతంలో తీసుకున్న బికినీ ఫొటోను ఇటీవల కరీనా కపూర్ షేర్ చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఇలియానా కూడా ఓ హాట్ ఫొటోను తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసింది. `త్రో బ్యాక్` అంటూ ఇది వ‌ర‌కు త‌ను పోస్టు చేసిన ఫొటోనే మ‌ళ్లీ పోస్టు చేసింది. ఈ ఫొటోలో తన జడలో పూలున్నాయని, కింద ప్యాంట్, కాళ్లకు చెప్పులు మాత్రం లేవని ఇలియానా కామెంట్ చేసింది. పాతదే అయినప్పటికీ ఈ ఫొటో ఇలియానా అభిమానులకు మాత్రం బాగా న‌చ్చింది. పోస్టు చేసిన తొలి రెండు గంట‌ల్లోనే ఐదు ల‌క్ష‌ల లైక్స్ దక్కించుకుంది. 

Updated Date - 2020-04-16T15:01:56+05:30 IST

Read more