‘సర్కార్’ కోసం కాదు.. కరోనా కోసం ప్రార్థిస్తా: వర్మ

ABN , First Publish Date - 2020-07-12T23:32:42+05:30 IST

రామ్‌గోపాల్ వర్మ చేసే ట్వీట్స్ గురించి మన దర్శకులు వారి సినిమాల్లో కామెడీగా ఎలా అయితే చూపిస్తారో.. నిజంగానే అలాగే ఉంటాయి వర్మ ట్విట్స్. ఈ విషయంలో

‘సర్కార్’ కోసం కాదు.. కరోనా కోసం ప్రార్థిస్తా: వర్మ

రామ్‌గోపాల్ వర్మ చేసే ట్వీట్స్ గురించి మన దర్శకులు వారి సినిమాల్లో కామెడీగా ఎలా అయితే చూపిస్తారో.. నిజంగానే అలాగే ఉంటాయి వర్మ ట్విట్స్. ఈ విషయంలో తనని మించిన మేధావి లేడని వర్మ భావన. అందుకే అర్థంకాకుండా ట్వీట్ చేసి, తనేదో ఘనకార్యం సాధించినట్లుగా ఫీలైపోతుంటాడు. తాజాగా ఆయన కరోనా పాజిటివ్ వచ్చిన అమితాబచ్చన్‌పై ట్వీట్ చేశారు. మీరు త్వరగా కోలుకోవాలని ప్రార్థనలు చేస్తున్నామని అమితాబ్‌ కోసం సెలబ్రిటీలందరూ ట్వీట్స్ చేస్తుంటే.. వర్మ మాత్రం అమితాబ్ కోసం కాదు.. కరోనా కోసం ప్రార్థనలు చేస్తున్నానంటూ వెరైటీగా ట్వీట్ చేశారు. అఫ్‌కోర్స్ అది ఆయన నైజం కాబట్టి దాని గురించి ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సిన అవసరమే లేదు.


‘‘కరోనా బ్యాక్‌ మీద తన్ని ఎప్పటిలానే మీరు ఇంకా ఆరోగ్యంగా తిరిగి వస్తారని నాకు తెలుసు సర్కార్. అందుకే నేను మీకోసం ప్రార్థనలు చేయను. కరోనా కోసం ప్రార్థనలు చేస్తాను. ఎందుకంటే.. ఇది మీ వరకు వచ్చిందంటే.. దాని చావుకే..’’ అని వర్మ తన ట్వీట్‌లో పేర్కొన్నారు. దీనిపై నెటిజన్లు కూడా ఇదే తరహాలో కామెంట్స్ చేస్తున్నారు. Updated Date - 2020-07-12T23:32:42+05:30 IST