కరోనాని తక్కువగా అంచనా వేయవద్దు: మీరాచోప్రా

ABN , First Publish Date - 2020-07-12T22:27:04+05:30 IST

కరోనా విషయంలో ఇప్పటి వరకు తీసుకున్న జాగ్రత్తలు ఒక ఎత్తు. ఇకపై తీసుకోవాల్సిన జాగ్రత్తలు మరో ఎత్తు. ఎందుకంటే ఎలా అంటుకుంటుందో కూడా తెలియకుండా వైరస్

కరోనాని తక్కువగా అంచనా వేయవద్దు: మీరాచోప్రా

కరోనా విషయంలో ఇప్పటి వరకు తీసుకున్న జాగ్రత్తలు ఒక ఎత్తు. ఇకపై తీసుకోవాల్సిన జాగ్రత్తలు మరో ఎత్తు. ఎందుకంటే ఎలా అంటుకుంటుందో కూడా తెలియకుండా వైరస్ వ్యాపిస్తుంది. అలాగే చిన్న, పెద్ద, ధనిక, పేద అనే కనికరం కూడా కరోనాకు లేదు. కరోనాకు ఎవరైనా ఒక్కటే. ఈ విషయం ఇప్పటికే అందరికీ అర్థమై ఉంటుంది. లక్షణాలు కాస్త తక్కువగా ఉన్నవాళ్లు తీసుకున్న జాగ్రత్తలతో బయటపడుతున్నారు. సరిగ్గా కరోనా అటాక్ అయితే మాత్రం తిప్పుకోవడం కష్టమే. ఎందుకంటే ఇప్పటి వరకు అధికారికంగా ఎటువంటి మందు, మాకు లేని రోగం ఇది. ఇక విషయంలోకి వస్తే హీరోయిన్ మీరా చోప్రా కరోనాని తక్కువ అంచనా వేయవద్దు అంటూ ట్వీట్ చేసింది. అమితాబచ్చన్ ఫ్యామిలీలో నలుగురికి కరోనా పాజిటివ్ నిర్థారణ కావడంతో.. ఇప్పుడందరూ బచ్చన్ ఫ్యామిలీ కోసం ప్రార్థనలు చేస్తున్నారు. బచ్చన్ ఫ్యామిలీ త్వరగా ఈ మహమ్మారి నుంచి బయటపడాలని ప్రార్థనలు చేస్తున్నట్లుగా తెలుపుతూ.. కరోనా విషయంలో మరింతగా జాగ్రత్తలు పాటించాలని ఆమె కోరింది. 


‘‘బచ్చన్ ఫ్యామిలీలోని ప్రతి ఒక్కరూ మంచి ఆరోగ్యంతో మళ్లీ తిరిగి రావాలని ప్రార్థిస్తున్నాను. ఈ వైరస్‌ ఎటువంటి వారికైనా వ్యాపిస్తుందని ఇప్పటికైనా అందరూ అర్థం చేసుకోండి. కరోనా వైరస్‌ను తక్కువగా అంచనా వేయవద్దు. ఇంటిలో ఒక వ్యక్తి బాధ్యతారాహిత్యం వల్ల కుటుంబం మొత్తం బాధపడాల్సి వస్తుందని తెలుసుకోండి. బాధ్యతగా ఉండండి. ఇంట్లో ఉండండి, సురక్షితంగా ఉండండి..’’ అని మీరా చోప్రా తన ట్వీట్‌లో పేర్కొంది.



Updated Date - 2020-07-12T22:27:04+05:30 IST