షూటింగ్ లొకేషన్‌లో బర్త్‌డే కేక్ కటింగ్ మిస్సవుతున్నా: నిధి అగర్వాల్

ABN , First Publish Date - 2020-08-17T03:28:54+05:30 IST

ఆగష్టు 17న హ్యాపెనింగ్ బ్యూటీ నిధి అగర్వాల్ పుట్టినరోజు. మిస్టర్ మజ్ను, ఇస్మార్ట్ శంకర్ వంటి సూపర్ హిట్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు నిధి అగర్వాల్

షూటింగ్ లొకేషన్‌లో బర్త్‌డే కేక్ కటింగ్ మిస్సవుతున్నా: నిధి అగర్వాల్

ఆగష్టు 17న హ్యాపెనింగ్ బ్యూటీ నిధి అగర్వాల్ పుట్టినరోజు. మిస్టర్ మజ్ను, ఇస్మార్ట్ శంకర్ వంటి సూపర్ హిట్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు నిధి అగర్వాల్ చాలా దగ్గరైంది. అటు బాలీవుడ్‌లో ఇటు టాలీవుడ్‌లో బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉన్న నిధి ఈ ఏడాది తన పుట్టినరోజును(ఆగష్టు17) బెంగళూరులో తన నివాసంలోనే కుటుంబ సభ్యులు మధ్య జరుపుకోనుంది. సినీ కెరీర్ స్టార్ట్ చేశాక తన పుట్టినరోజు సెట్స్‌లోనే జరిగేదని, యూనిట్ సభ్యులు మధ్య కేక్ కటింగ్ సెలబ్రేషన్స్ జరిగేవని, కరోనా కారణంగా తాను యాక్ట్ చేస్తున్న సినిమా షూటింగ్స్ ప్రస్తుతం ఆగిపోవడం కారణంగా ఈ ఏడాది ఇంట్లో కుటుంబంతోనే పుట్టినరోజు జరుపుకుంటున్నట్లుగా నిధి తెలిపారు. 


ప్రస్తుతం నిధి, మహేష్ బాబు మేనల్లుడు గల్లా అశోక్ లాంఛింగ్ మూవీలో నటిస్తున్నారు. అలానే తమిళ్‌లో భూమి అనే చిత్రం చేస్తున్నారు. వీటితో పాటు మరికొన్ని కొత్త కథలు వింటున్నారు. ఇక తాజాగా ఫేస్ బుక్‌లో సరికొత్త రికార్డు సెట్ చేశారు నిధి. ఈ జనరేషన్ యంగ్ హీరోయిన్స్‌లో అత్యధికంగా 8.5 మిలియన్ ఫేస్‌బుక్ ఫాలోవర్స్‌తో నిధి మొదటి స్థానంలో ఉన్నారు.

Updated Date - 2020-08-17T03:28:54+05:30 IST