ఆ విషయం నాకూ ఇప్పుడే తెలిసింది

ABN , First Publish Date - 2020-06-12T06:35:08+05:30 IST

అవకాశాలు ఉన్నంతవరకూ సంపాదించుకోవడం, వేషాలు తగ్గిన తర్వాత పెళ్లి చేసుకొని సినిమాలకు దూరం కావడం... సాధారణంగా ఏ హీరోయిన్‌ అయినా చేసే పనే ఇది. అవకాశాలు తగ్గడంతో ఇప్పుడు హీరోయిన్‌ హన్సిక కూడా వరుణ్ణి వెతుక్కొనే పనిలో...

ఆ విషయం నాకూ ఇప్పుడే తెలిసింది

అవకాశాలు ఉన్నంతవరకూ సంపాదించుకోవడం, వేషాలు తగ్గిన తర్వాత పెళ్లి చేసుకొని సినిమాలకు దూరం కావడం... సాధారణంగా ఏ హీరోయిన్‌ అయినా చేసే పనే ఇది. అవకాశాలు తగ్గడంతో ఇప్పుడు హీరోయిన్‌  హన్సిక కూడా వరుణ్ణి వెతుక్కొనే పనిలో ఉందనే వార్తలు వస్తున్నాయి. ఆమె ప్రయత్నాలు ఫలించాయనీ, ఓ వ్యాపారవేత్తతో హన్సిక పెళ్లి జరుగనుందనీ ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ విషయం హన్సిక వరకూ వెళ్లింది. ఆమె ఒక్కసారిగా నవ్వేసి ‘నాకు పెళ్లా?... నేను పెళ్లి చేసుకొనే ఆ వ్యాపారవేత్త ఎవరో చెప్పరూ’ అని ట్విటర్‌లో పోస్ట్‌ చేసింది. ఇక హన్సిక పెళ్లి చేసుకోబోతోందంటూ వచ్చిన వార్తలను చూసి ఆమె అభిమాని ఒకరు హర్ట్‌ అయి, ‘ఈ విషయం నాకు చెప్పనేలేదే’ అని కామెంట్‌ చేశాడు. ‘ఏం చెయ్యను... నాకు కూడా ఇప్పుడే తెలిసింది’ అని ఫన్నీగా సమాధానం ఇచ్చింది హన్సిక. తమిళ హీరో శింబు, హన్సిక గతంలో గాఢంగా ప్రేమించుకున్నారు. హన్సికను పెళ్లి చేసుకోబోతున్నానంటూ 2013లో శింబు ఓపెన్‌గా ప్రకటించారు కూడా. చాలా కాలం ప్రేమించుకొన్న 

వీరిద్దరూ పరిస్థితులు అనుకూలించకపోవడంతో పెళ్లి చేసుకోకుండానే విడిపోయారు. హన్సిక ప్రస్తుతం నటిస్తున్న ‘మహా’ తమిళ చిత్రంలో ఆమె మాజీ ప్రియుడు శింబు అతిథి పాత్ర పోషిస్తుండడం గమనార్హం.


Updated Date - 2020-06-12T06:35:08+05:30 IST