సోషల్‌ మీడియాపై ఇంట్రస్ట్‌ లేదు: అజిత్‌

ABN , First Publish Date - 2020-03-08T15:51:50+05:30 IST

సోషల్‌ మీడియాలో చేరే సమయం ఆసన్నమైనందంటూ గత 6వ తేదీన నటుడు అజిత్‌ సంతకంతో కూడిన ఒక లేఖ విడుదలకావడంతో ఆయన అభిమానులు పండుగ

సోషల్‌ మీడియాపై ఇంట్రస్ట్‌ లేదు: అజిత్‌

సోషల్‌ మీడియాలో చేరే సమయం ఆసన్నమైనందంటూ గత 6వ తేదీన నటుడు అజిత్‌ సంతకంతో కూడిన ఒక లేఖ విడుదలకావడంతో ఆయన అభిమానులు పండుగ చేసుకున్నారు. ‘తల’ సోషల్‌ మీడియా ఎంట్రీ కోసం ఎదురుచూస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో సోషల్‌ మీడియాపై తనకు ఇంట్రస్ట్‌ లేదని న్యాయవాదుల ద్వారా అజిత్‌ శనివారం ఒక ప్రకటన చేశారు. అజిత్‌కి అధికారిక సోషల్‌ మీడియా ఖాతాలు ఏవీ లేవని స్పష్టం చేశారు. అదే సమయంలో, అజిత్‌ సంతకం ఫోర్జరీ చేసిన వ్యక్తుల ఆచూకీ కోసం గాలిస్తున్నారు.

Updated Date - 2020-03-08T15:51:50+05:30 IST