10 స్వచ్ఛంద సంస్థలకు సమంత విరాళం.. ఎందుకంటే?

ABN , First Publish Date - 2020-05-27T05:00:08+05:30 IST

ఆశ కుటీర్, లహరి ఓల్డేజ్ హోమ్, డిజైర్ సొసైటీ, వాల్మీకి ఫౌండేషన్, స్పందన సొసైటీ, అక్షయ ట్రస్ట్, భారతమాత సోషల్ సర్వీస్ సొసైటీ, మా ఇల్లు, గుడ్ సమరితాన్స్ ఇండియా

10 స్వచ్ఛంద సంస్థలకు సమంత విరాళం.. ఎందుకంటే?

ఆశ కుటీర్, లహరి ఓల్డేజ్ హోమ్, డిజైర్ సొసైటీ, వాల్మీకి ఫౌండేషన్, స్పందన సొసైటీ, అక్షయ ట్రస్ట్, భారతమాత సోషల్ సర్వీస్ సొసైటీ, మా ఇల్లు, గుడ్ సమరితాన్స్ ఇండియా, నిర్మాణ్ అసోసియేషన్‌.. మొత్తం పది స్వచ్ఛంద సంస్థలకు విరాళం ఇచ్చినట్లుగా సమంత తన ఇన్‌స్టాగ్రమ్‌లో పోస్ట్ చేశారు. అయితే దీనివెనుక పెద్ద కథే ఉంది. సమంత ఇన్‌స్టా కుటుంబం చాలా పెద్దదైంది. అందుకే ఆ పెద్దరికాన్ని అదే రూపంలో సమంత సెలబ్రేట్ చేసుకుంది. అర్థం కాలేదు కదా..! సమంత ఇన్‌స్టాగ్రమ్ కుటుంబం 10 మిలియన్స్‌కి చేరుకుంది. 10 మిలియన్ మెంబర్స్ సమంతను ఫాలో అవుతున్నారు. తనని ఫాలో అయ్యే వారి సంఖ్య 10 మిలియన్స్‌కి చేరుకున్నందున ఆమె సెలబ్రేట్ చేసుకోవాలని అనుకున్నారు. 


అయితే సెలబ్రేషన్స్ అంటే కేక్ కటింగ్స్, చుట్టాలందరినీ పిలిచి పార్టీ చేసుకోవడాలు కాకుండా.. ఇక్కడ సమంత చాలా గొప్పగా ఆలోచించింది. 10 స్వచ్ఛంద సంస్థలకు విరాళం ఇచ్చి తన గొప్పమనసును మరోసారి చాటుకుంది. ఈ విషయంలో తనకు హాలీవుడ్ నటి నటాలీ పోర్ట్‌మన్ స్ఫూర్తి అని కూడా సమంత తన పోస్ట్‌లో పేర్కొంది. ఇక సమంత చేసిన ఈ మంచి పనికి నెటిజన్లు ఆమెపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. 



Updated Date - 2020-05-27T05:00:08+05:30 IST