నాకు కరోనా లేదు

ABN , First Publish Date - 2020-06-29T09:50:04+05:30 IST

యాంకర్‌, దర్శకుడు ఓంకార్‌కు కరోనా సోకిందంటూ సోషల్‌ మీడియాలో జరుగుతున్న ప్రచారంపై ఆయన స్పందించారు. తనకు కరోనా సోకలేదని, పరీక్షలు చేయించగా నెగటివ్‌ వచ్చిందని ‘చిత్రజ్యోతి’తో చెప్పారు...

నాకు కరోనా లేదు

యాంకర్‌, దర్శకుడు ఓంకార్‌కు కరోనా సోకిందంటూ సోషల్‌ మీడియాలో జరుగుతున్న ప్రచారంపై ఆయన స్పందించారు. తనకు కరోనా సోకలేదని, పరీక్షలు చేయించగా నెగటివ్‌ వచ్చిందని ‘చిత్రజ్యోతి’తో చెప్పారు. ‘‘లాక్‌డౌన్‌ సడలింపుతో ప్రభుత్వ నిబంధనలతో ‘ఇస్మార్ట్‌ జోడీ’ షూటింగ్‌ ప్రారంభించి ఓ షెడ్యూల్‌ పూర్తి చేశా. బయట పరిస్థితులు దృష్ట్యా, ఇంట్లో 55 ఏళ్లు దాటిన అమ్మ, చిన్న పిల్లలు ఉన్నారని ముందు జాగ్రత్తగా ఈ నెల 26న కొవిడ్‌ 19 పరీక్ష చేయించుకున్నా. శనివారం సాయంత్రం వచ్చిన రిపోర్ట్స్‌లో నెగెటివ్‌ అని తేలింది. అదే రిపోర్ట్‌ నేను షోలు చేస్తున్న టీవీ ఛానెళ్లకు పంపించాను. పరీక్షల కోసం ఆసుపత్రికి వెళ్లినప్పుడు చూసిన వారెవరో రూమర్స్‌ క్రియేట్‌ చేసుంటారని నేను అనుకుంటున్నా. బయట ప్రచారం జరుగుతున్నట్లు అలాంటిదేమీ లేదు. నేను ఆరోగ్యంగా ఉన్నా’’ అని ఓంకార్‌ తెలిపారు.  


Updated Date - 2020-06-29T09:50:04+05:30 IST