ఆమెను పెళ్లి చేసుకునే ప్ర‌స‌క్తే లేదంటున్న బిగ్‌బాస్ కంటెస్టెంట్‌

ABN , First Publish Date - 2020-02-02T22:51:22+05:30 IST

‘బిగ్‌బాస్‌’ ఫేమ్‌ దర్శన్‌ తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడని నటి సనంశెట్టి సంచలన ఆరోపణలు చేశారు. అయితే దీనిపై దర్శన్‌ స్పందిస్తూ

ఆమెను పెళ్లి చేసుకునే ప్ర‌స‌క్తే లేదంటున్న బిగ్‌బాస్ కంటెస్టెంట్‌

‘బిగ్‌బాస్‌’ ఫేమ్‌ దర్శన్‌ తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడని నటి సనంశెట్టి సంచలన ఆరోపణలు చేశారు. అయితే దీనిపై దర్శన్‌ స్పందిస్తూ, ఎట్టి పరిస్థితుల్లోను తాను సనంను పెళ్లి చేసుకోనని ప్రకటించారు. ఈ విషయమై దర్శన్‌ శనివారం మీడియాతో మాట్లాడుతూ, గతంలో తనకు, సనంశెట్టికి నిశ్చితార్ధం జరిగిన మాట వాస్తవ మేనని, ఇది ఆమె తల్లిదండ్రులకు మాత్రమే తెలుసునని చెప్పాడు. అయితే తన చెల్లెలి పెళ్లికి ఇబ్బంది కలుగుతుందేమోనని తన ఇంట్లో ఈ విషయాన్ని చెప్పలేదన్నాడు. నిజానికి సనంశెట్టి తనకు ఆర్ధిక, మానసికంగా ఎంతో సహాయం చేసిందని, అయితే ‘బిగ్‌బాస్‌’ నుంచి బయటకి వచ్చాక ఆమె మరొకరితో సంబంధం కలిగి ఉందని ఆరోపించాడు. అతను ఎవరనేది తాను చెప్పలేనని, ఇంతక జరిగాక ఆమెతో కలిసి జీవించలేనని, అందుకే ఆమెని పెళ్లి చేసుకోబోనని చెప్పాడు. ఇకపోతే, సనంశెట్టి చేసిన సాయాన్ని తాను మరువలేనని, ఆ కారణంగానే ఆమెపై తాను పోలీసు కేసు పెట్టబోవడం లేదని దర్శన్‌ పేర్కొన్నాడు.

Updated Date - 2020-02-02T22:51:22+05:30 IST