‘అరవింద సమేత’లోని కొన్ని షాట్స్‌లో నేను ఇన్‌వాల్వ్ కాలేదు: జగపతిబాబు
ABN , First Publish Date - 2020-04-16T00:14:21+05:30 IST
యంగ్ టైగర్ ఎన్టీఆర్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్‌లో రూపొందిన తొలి చిత్రం ‘అరవింద సమేత’. రాయలసీమ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కిన ఈ చిత్రం మంచి విజయాన్ని దక్కించుకుంది.

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్‌లో రూపొందిన తొలి చిత్రం ‘అరవింద సమేత’. రాయలసీమ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కిన ఈ చిత్రం మంచి విజయాన్ని దక్కించుకుంది. కమర్షిల్‌గా సక్సెస్ సాధించడమే కాదు.. విమర్శకుల ప్రశంసలు కూడా అందుకుంది. ఇందులో జగపతిబాబు మెయిన్ విలన్‌గా నటించారు. రీసెంట్ ఇంటర్వ్యూలో ఆయన ‘అరవింద సమేత’ సినిమా గురించి మాట్లాడుతూ ‘‘నేను క్వారంటైన్ టైమ్‌లో పాజిటివ్‌గా ఉండటానికి ప్రయత్నిస్తున్నాను. యోగ చేస్తున్నాను. మనసుని ప్రశాంతగా ఉంచుకుంటున్నాను. బాగా నిద్రపోతున్నాను. సినిమాలు చూస్తున్నాను. ముఖ్యంగా నా సినిమాలను చూస్తున్నాను. అందులో నేను ఎలా నటించాను? బాగా చేశానా? ఇంకా బాగా చేసుండాల్సిందా? అనే విషయాలు గురించి ఆలోచిస్తున్నాను. ఎందుకంటే నటనపై మన మూడ్ అనేది ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తుందో తెలుసుకునే అవకాశం ఉంది. ఉదాహరణకు ‘అరవింద సమేత’ చూస్తున్నప్పుడు కొన్ని సీన్స్‌లోని షాట్స్‌లో నేను సరిగ్గా ఇన్‌వాల్వ్ కాలేదని నాకు అనిపించింది. అందుకు కారణం నా మూడ్ కాబట్టి. రిలాక్స్‌గా ఉండటానికి ప్రయత్నిస్తున్నాను’’ అన్నారు జగపతిబాబు.