నేనో తప్పు చేశా... నాన్న అలా అనేశారు

ABN , First Publish Date - 2020-05-11T08:06:54+05:30 IST

‘‘నాకు పాటలు, కవిత్వాలు రాయడం అంటే ఇష్టం. ప్రొడక్షన్‌ అంటే ఇంట్రెస్ట్‌! నేను సాధించాలనుకుంటున్న ఘనతలెన్నో ఉన్నాయి. వాటన్నిటికి టైమ్‌ ఉంది. చివరకు, నేను మంచి తల్లిని కావాలనుకుంటున్నా...

నేనో తప్పు చేశా... నాన్న అలా అనేశారు

‘‘నాకు పాటలు, కవిత్వాలు రాయడం అంటే ఇష్టం. ప్రొడక్షన్‌ అంటే ఇంట్రెస్ట్‌! నేను సాధించాలనుకుంటున్న ఘనతలెన్నో ఉన్నాయి. వాటన్నిటికి టైమ్‌ ఉంది. చివరకు, నేను మంచి తల్లిని కావాలనుకుంటున్నా. నా అంతిమ లక్ష్యం అదే! మహిళగా అదో గొప్ప ఘనత’’ అని శ్రుతీ హాసన్‌ అన్నారు. మాతృదినోత్సవం సందర్భంగా ఆదివారం ఆమె చెప్పిన విషయమిది. అంతకు ముందు శనివారం రాత్రి ‘నిద్ర రావడం లేదు. సరదాగా ఏదో ఒకటి అడగండి’ ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రేక్షకులకు అవకాశం ఇచ్చారు. ఎటువంటి ఫిల్టర్స్‌ లేకుండా సమాధానాలు ఇచ్చారు. ఓ లుక్కేయండి మరి!


‘గబ్బర్‌ సింగ్‌’ విడుదలై సోమవారానికి ఎనిమిదేళ్లు. ఎటువంటి అనుభూతి కలుగుతోంది?

చాలా చక్కటి అనుభూతి! అంత పెద్ద విజయం సాధించిన చిత్రంలో నేనూ ఓ భాగం కావడం అదృష్టంగా భావిస్తున్నాను. నా దారిలో చాలా మార్పులు తీసుకొచ్చింది. ఎప్పుడూ కృతజ్ఞురాలిగా ఉంటాను.


లాక్‌డౌన్‌ తొలగించిన తర్వాత మీరు చేయబోయే తొలి పని?

తప్పకుండా షూటింగులకు వెళతా. ఐ మిస్‌ వర్కింగ్‌. అయితే... సురక్షితమైన వాతావరణం ఉందంటేనే నేను చిత్రీకరణ చేయడానికి వెళతా!


 మీ నాన్న (కమల్‌ హాసన్‌) ఎలా ఉన్నారు?

వెరీ వెల్‌! ప్రస్తుతం నాన్న చెన్నైలో ఉన్నారు. చాలా బావున్నారు. తనకు తానుగా స్వీయ నిర్బంధంలో ఉన్నారు.


ఎప్పుడైనా నాన్న చేతిలో తన్నులు, తిట్లు తిన్నారా?

ఎప్పుడూ లేదు! నన్ను గాని, చెల్లిని గాని ఎప్పుడూ నాన్న కొట్టలేదు. కనీసం తిట్టలేదు కూడా! ఒకసారి నేనో తప్పు చేశా. ఆయన ‘అయామ్‌ సో డిజప్పాయింటెడ్‌’ అన్నారు. నాకు ఏం చేయాలో తెలియలేదు.


ఎప్పుడైనా గ్యాస్‌ వదిలి, మీ చెల్లెలు (అక్షరా హాసన్‌) మీద నింద వేశారా?

చాలాసార్లు! నిజం ఏంటంటే... తనే నాతో ఎక్కువసార్లు అలా చేసింది. రెండు గంటలకు ఒకసారైనా గ్యాస్‌ వదలి ‘నేను కాదు’ అంటుంది. అలా చేయడంలో తను రాణి (నవ్వులు).


ఎర్లీ 2000లో చెన్నై ఫ్రెండ్‌ వచ్చినప్పుడు బ్యాండ్‌స్టాండ్‌లో ఏం జరిగింది?

(నవ్వుతూ) ఈ క్వశ్చన్‌ మా చెల్లి అక్షర అడిగింది. నేను అందరికీ ఓ విషయం చెప్పాలనుకుంటున్నా! అవును... ఎవరో సుసుకు వెళితే అందులో జారిపడ్డాను. నిజమే... అలా జరిగింది. నా చెల్లి హెల్ప్‌ చేయడం మానేసి, నన్ను చూసి నవ్వింది.


మీరు ఆలోచించేటప్పుడు ఏ భాషలో ఆలోచిస్తారు?

ఇంగ్లి్‌షలో ఆలోచిస్తా. అయితే... బ్యాడ్‌ వర్డ్స్‌ దగ్గరకు వచ్చేసరికి ఎప్పుడూ తమిళం, హిందీలో ఆలోచిస్తా. ఇంగ్లిష్‌ కంటే మన భాషల్లో ఒక పంచ్‌ ఉంటుంది. మిగతా పదాలు ఇంగ్లి్‌షలో బావుంటాయు.


రోజూ స్నానం చేస్తారా? రెండు రోజులకు ఒకసారా?

(నవ్వుతూ...) లవ్‌ థిస్‌ క్వశ్చన్‌! రోజుకు రెండుసార్లు స్నానం చేస్తా. రెండు రోజులకు ఒకసారి తలస్నానం చేస్తా.


దేవుణ్ణి నమ్ముతారా?

నమ్ముతా. వ్యక్తులను బట్టి దేవుడికి ఇచ్చే నిర్వచనం మారుతుంది. కొందరు డబ్బులో దేవుణ్ణి చూస్తారు. మరికొందరు విగ్రహాల్లో చూస్తారు. ఇంకొకరు ఇంకో రూపంలో చూస్తారు. అన్నిటి కంటే ముఖ్యమైనది ఏంటంటే... ప్రతి ఒక్కరూ అహం బ్రహ్మసిలా తమలోకి తాము వెళ్లి ఆత్మపరిశీలన చేసుకోవడం!


మీ ఇంట్లో దెయ్యం ఉందా?

లేదని ఆశిస్తున్నా!


మీకు ఇష్టమైన పువ్వు?

ఎప్పుడూ గులాబీయే. నా చేతి మీద టాటూ కూడా వేయించుకున్నా. దురదృష్టవశాత్తూ... అది క్యాబేజీలా కనబడుతోంది.


మీకు బాయ్‌ఫ్రెండ్‌ ఉన్నారా?

సరే... టాటా బైబై!

Updated Date - 2020-05-11T08:06:54+05:30 IST