నేను సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ కాదు... తెలుగు యాక్టర్‌ని!

ABN , First Publish Date - 2020-07-12T05:07:22+05:30 IST

‘‘బయటకు వెళ్లి తినడం అంటే ఇష్టం. కానీ, కొన్నేళ్లుగా ఎక్కువశాతం ఆర్డర్‌ చేసుకుని, హోమ్‌ డెలివరీ తెప్పించకుంటున్నా. కొన్ని నెలలుగా హోమ్‌ ఫుడ్‌ మాత్రమే తింటున్నా. కరోనా మనకు చాలా నేర్పింది...

నేను సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ కాదు... తెలుగు యాక్టర్‌ని!

‘‘బయటకు వెళ్లి తినడం అంటే ఇష్టం. కానీ, కొన్నేళ్లుగా ఎక్కువశాతం ఆర్డర్‌ చేసుకుని, హోమ్‌ డెలివరీ తెప్పించకుంటున్నా. కొన్ని నెలలుగా హోమ్‌ ఫుడ్‌ మాత్రమే తింటున్నా. కరోనా మనకు చాలా నేర్పింది. జీవితంలో ప్రతి ఒక్కరికీ సవాళ్లు ఎదురవుతాయి. కానీ, జీవితమంటేనే సవాళ్ల నుంచి నేర్చుకుని ముందుకు సాగడమే కదా! లాక్‌డౌన్‌లో చాలా నేర్చుకున్నాను. అన్నిటికంటే ముఖ్యంగా సహనంతో ఉండడం నేర్చుకున్నా’’ అని సుశాంత్‌ అన్నారు. శనివారం సాయంత్రం ఆయన ట్విట్టర్‌లో ప్రేక్షకులతో ముచ్చటించారు. ప్రస్తుతం నో పార్కింగ్‌ కాన్సె్‌ప్టతో ‘ఇచట వాహనములు నిలపరాదు’ చేస్తున్నారు సుశాంత్‌. ఆ సినిమా గురించి మాట్లాడుతూ ‘‘వేసవిలో చిత్రాన్ని విడుదల చేయాలనుకున్నాం. 75 శాతం చిత్రీకరణ పూర్తయింది. ఈలోగా కరోనా వచ్చింది. వీలైనంత త్వరగా ఆ సినిమా పూర్తి చేస్తాం. ఇది కాన్సెప్ట్‌ బేస్డ్‌ ఫిల్మ్‌. రియలిస్టిక్‌గా ఉంటుంది. అదే సమయంలో కమర్షియల్‌గానూ ఉంటుంది. ఇందులో డ్యాన్స్‌ నంబర్స్‌ కూడా ఉన్నాయి. నా క్యారెక్టర్‌లో మంచి ఎమోషన్స్‌ ఉన్నాయి. విలక్షణ పాత్ర అని చెప్పవచ్చు. ప్రేక్షకులకు నచ్చుతుందని ఆశిస్తున్నా’’ అని అన్నారు. లాక్‌డౌన్‌లో కీబోర్డ్‌ ప్లే చేయడం నేర్చుకున్నాననీ, తాను సంగీతం ఎక్కువ వింటానని ఆయన తెలిపారు. ఒక నెటిజన్‌ ‘మీరు ఎవరు? సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ అని ప్రజలు తప్పుగా అనుకుంటున్నారు’ అని ప్రశ్నించగా... ‘‘నేను తెలుగు యాక్టర్‌ని. సుశాంత్‌పై నాకు అమితమైన గౌరవం ఉంది. చాలా ట్యాలెంటెడ్‌ ఆర్టిస్ట్‌. సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ అనుకుని చాలామంది ట్విట్టర్‌లో నాకు ట్యాగ్‌ చేస్తున్నారు. నన్ను మెన్షన్‌ చేస్తున్నారు’’ అని సుశాంత్‌ సమాధానం ఇచ్చారు.  
Updated Date - 2020-07-12T05:07:22+05:30 IST