బన్నీ, విజయ్ ఏం తింటారో అడగాలి: హృతిక్

ABN , First Publish Date - 2020-03-04T17:08:21+05:30 IST

బాలీవుడ్ స్టార్ హీరో, డ్యాన్సింగ్ స్టార్ హృతిక్ రోషన్ దక్షిణాది సినిమాలపై, హీరోలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

బన్నీ, విజయ్ ఏం తింటారో అడగాలి: హృతిక్

బాలీవుడ్ స్టార్ హీరో, డ్యాన్సింగ్ స్టార్ హృతిక్ రోషన్ దక్షిణాది సినిమాలపై, హీరోలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. దక్షిణాది సినిమాల్లో సాంకేతిక పరిజ్ఞానం అద్భుతంగా ఉంటుందని, బాలీవుడ్ దానిని నేర్చుకోవాలని హృతిక్ అన్నాడు. ఇక, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, తమిళ ప్రముఖ హీరో విజయ్ డ్యాన్స్ అంటే తనకు చాలా ఇష్టమని తెలిపాడు. 


`డ్యాన్స్ చేయడానికి ఎంతో సాధన కావాలి. ఆస్వాదించాలి. మనం డ్యాన్స్‌ను ఎంజాయ్ చేస్తేనే మొహంలో ఆ ఫీలింగ్స్ కనబడతాయి. అల్లు అర్జున్ డ్యాన్స్ ఎనర్జిటిక్, స్ఫూర్తిదాయకం. అలాగే విజయ్ కూడా అద్భుతమైన డ్యాన్సర్. నాకు తెలిసి వీరు రహస్యంగా ఏదో తింటున్నారు. లేకపోతే రోజూ అదే ఉత్సాహంతో పనిచేయడం చాలా కష్టం. డ్యాన్స్‌కు ముందు వీరు తీసుకునే ప్రత్యేక డైట్ ఏంటో తెలుసుకోవాల`ని హృతిక్ అన్నాడు.  

Updated Date - 2020-03-04T17:08:21+05:30 IST

Read more