హృతిక్ చేతిలో ఉన్నది సిగరెట్ కాదట!
ABN , First Publish Date - 2020-04-27T17:34:07+05:30 IST
పక్క ఫొటోలో ఉన్న హృతిక్ రోషన్ చేతిలో ఉన్నదేమిటి? పిల్లల పక్కన నిల్చుని హృతిక్ సిగరెట్ తాగుతున్నట్టు అనిపిస్తోంది కదూ

పక్క ఫొటోలోని హృతిక్ రోషన్ చేతిలో ఉన్నదేమిటి? పిల్లల పక్కన నిల్చుని హృతిక్ సిగరెట్ తాగుతున్నట్టు అనిపిస్తోంది కదూ! అయితే మీ కళ్లు మిమ్మల్ని మోసం చేస్తున్నాయి. నిజానికి హృతిక్‌కు సిగరెట్ కాల్చే అలవాటు లేదు. కానీ, ఈ ఫొటో చూస్తే హృతిక్ చేతిలో సిగరెట్ ఉన్నట్టే అనిపిస్తుంది. పట్టి పట్టి చూస్తే అసలు విషయం అర్థమవుతుంది.
ఈ ఫొటో గురించి ఓ అభిమాని నేరుగా హృతిక్‌నే ప్రశ్నించాడు. ఆ ప్రశ్నకు హృతిక్ స్పందించాడు. `నాకు స్మోకింగ్ చేసే అలవాటు లేదు. నేనే గనక నిజంగా క్రిష్ అయితే ప్రస్తుతం మనల్ని వేధిస్తున్న వైరస్‌ను, ఈ భూమ్మీద ఉన్న సిగరెట్లన్నింటినీ నాశనం చేస్తాన`ని హృతిక్ సమాధానమిచ్చాడు.