హృతిక్‌ మరదలి ఇంట్లో కరోనా

ABN , First Publish Date - 2020-04-16T10:01:14+05:30 IST

హిందీ హీరో హృతిక్‌ రోషన్‌ మాజీ భార్య సుసానే సోదరి ఫరా ఖాన్‌ అలీ ఇంట్లో పని చేసే సిబ్బంది ఒకరు కరోనా బారిన పడ్డారు. తమ స్టాఫ్‌లో ఒకరు కోవిడ్‌19 పాజిటివ్‌గా తేలడంతో ఆమె ఇంట్లో...

హృతిక్‌ మరదలి ఇంట్లో కరోనా

హిందీ హీరో హృతిక్‌ రోషన్‌ మాజీ భార్య సుసానే సోదరి ఫరా ఖాన్‌ అలీ ఇంట్లో పని చేసే సిబ్బంది ఒకరు కరోనా బారిన పడ్డారు. తమ స్టాఫ్‌లో ఒకరు కోవిడ్‌19 పాజిటివ్‌గా తేలడంతో ఆమె ఇంట్లో కుటుంబ సభ్యులు, మిగతా సిబ్బంది సైతం ఇంటి దగ్గరే వైద్య పరీక్షలు చేయించుకున్నారు. కరోనా సోకిన వ్యక్తిని చికిత్సకి పంపడంతో పాటు తామంతా తగిన జాగ్రత్తలు తీసుకుంటూ క్వారంటైన్‌లోకి వెళుతున్నామని ఫరా ఖాన్‌ అలీ తెలిపారు. ఆమె నగల డిజైనర్‌గా పని చేస్తున్నారు. లాక్‌డౌన్‌ సమయంలో తల్లిదండ్రులు ఇద్దరూ పిల్లల దగ్గర ఉండడం అవసరమని హృతిక్‌ భావించడంతో, తాత్కాలికంగా ఆయన ఇంటికి సుసానే షిఫ్టయ్యారు. అందువల్ల, తన ఆరోగ్యం గురించి ఆమె ఆందోళన చెందకపోయినా, సోదరి కుటుంబం గురించి ఆందోళన పడుతున్నారు.

Updated Date - 2020-04-16T10:01:14+05:30 IST

Read more