డైరెక్టర్‌కు రొమాంటిక్ డౌట్.. ఆసక్తికర చర్చ!
ABN , First Publish Date - 2020-04-16T17:17:35+05:30 IST
ప్రస్తుతం కరోనా కారణంగా ప్రపంచమంతా వణికిపోతోంది. ఒకరితో మరొకరు చేతులు కలపడానికే భయపడుతున్నారు.

ప్రస్తుతం కరోనా కారణంగా ప్రపంచమంతా వణికిపోతోంది. ఒకరితో మరొకరు చేతులు కలపడానికే భయపడుతున్నారు. కరోనా మహమ్మారిని తరిమికొట్టడానికి సామాజిక దూరమొకటే మార్గమని, మనిషికి మనిషికి మధ్య ఆరు అడుగుల దూరం పాటించాలని అందరూ చెబుతున్నారు. లాక్‌డౌన్ తర్వాత కూడా ఇదే పరిస్థితి కొనసాగే అవకాశం కనిపిస్తోంది.
ఈ నేపథ్యంలో బాలీవుడ్ డైరెక్టర్ సూజిత్ సర్కార్‌కు ఓ అనుమానం వచ్చింది. `విక్కీ డోనర్`, `మదరాస్ కేఫ్`, `పీకు` వంటి చిత్రాలతో మంచి పేరు తెచ్చుకున్న సూజిత్.. రొమాంటిక్ సన్నివేశాల చిత్రీకరణ గురించి ఆందోళన చెందుతున్నాడు. `ఇదంతా ముగిసిపోయిన తర్వాత సినిమాల్లో ఇంటిమేట్ సన్నివేశాలను ఎలా చిత్రీకరిస్తారో చూడాలి. ముఖ్యంగా కౌగలింత, ముద్దు సన్నివేశాలను ఎలా షూట్ చేస్తారో..! నటీనటులను దూరంగానే ఉంచి షూట్ చేసి, ఆ తర్వాత దగ్గరగా ఉన్నట్లు చూపించాల్సి వస్తుందేమో. మోసం చేసి అయినా కథలు చెప్పాల్సిందే కదా` అని ఆయన ట్వీట్ చేశారు. ఈ పోస్ట్‌పై సోషల్ మీడియాలో ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఈ ట్వీట్‌కు నటి దియా మిర్జా స్పందిస్తూ.. `సినిమా షూటింగ్ అనేదే ఇంటిమేట్ కదా గురూజి. కొన్ని వేల మంది దగ్గర దగ్గరగా ఉండి పనిచేయాల్సి ఉంటుంది. భవిష్యత్తు ఎలా ఉంటుందో అర్థం కావడం లేదు. కాలమే సమాధానం చెప్పాల`ని పేర్కొంది. `మళ్లీ 60, 70ల కాలం నాటి టెక్నిక్ ఫాలో కావాల్సిందే. ముద్దు సీన్లు వచ్చినపుడు రెండు పువ్వులను చూపించడమే` అని ఓ నెటిజన్ ట్వీట్ చేశాడు.
Read more