హాట్ స్టార్ నుంచి ట్రిపుల్ ధమాకా!
ABN , First Publish Date - 2020-10-25T05:59:06+05:30 IST
దీపావళి ధమాకాకు ఓటీటీ ప్లాట్‌ఫాం హాట్‌స్టార్ సిద్ధమవుతోంది. నయనతార, తమన్నా, కాజల్ మొదలైన సుప్రసిద్ధ హీరోయిన్ల సినిమాలను, షోలను విడుదల చేయనుంది...

దీపావళి ధమాకాకు ఓటీటీ ప్లాట్‌ఫాం హాట్‌స్టార్ సిద్ధమవుతోంది. నయనతార, తమన్నా, కాజల్ మొదలైన సుప్రసిద్ధ హీరోయిన్ల సినిమాలను, షోలను విడుదల చేయనుంది. నయనతార, ఆర్‌జె బాలాజీ నటించిన ముక్కుత్తి అమ్మన్‌ను త్వరలోనే విడుదల చేయనున్నారు.
కాజల్, వైభవ్, అన్నాదీ నటించిన లైవ్ టెలికాస్ట్ అనే హారర్ షోను.. సత్యరాజ్, సీత నటించిన మై ఫెరఫెక్ట్ హాజ్బండ్ అనే కామెడీ సిరీస్‌ను.. తమన్నా నటించిన నవంబర్ స్టోరీ అనే క్రైమ్ థ్రిల్లర్‌ను కూడా హాట్ స్టార్‌లో విడుదల చేయనున్నారు. దీనితో పాటుగా జయ్ సంపత్, వాణీ భోజన్ నటించిన ట్రిపుల్స్ అనే కామెడీ సిరీస్‌ను కూడా విడుదల చేస్తారు. ఈ సిరీస్‌లన్నింటినీ త్వరలోనే తెలుగులోకి డబ్ చేసి విడుదల చేస్తారు.
Read more