హాట్ డ్రెస్‌పై ట్రోలింగ్.. ప్రియాంక స్పందన!

ABN , First Publish Date - 2020-02-03T21:45:53+05:30 IST

బాలీవుడ్ నుంచి హాలీవుడ్‌లోకి అడుగుపెట్టి గ్లోబల్‌స్టార్‌గా ఎదిగింది ప్రియాంకా చోప్రా.

హాట్ డ్రెస్‌పై ట్రోలింగ్.. ప్రియాంక స్పందన!

బాలీవుడ్ నుంచి హాలీవుడ్‌లోకి అడుగుపెట్టి గ్లోబల్‌స్టార్‌గా ఎదిగింది ప్రియాంకా చోప్రా. అక్కడి ట్రెండ్‌కు తగినట్టు హాట్‌హాట్ డ్రెస్స్‌ల్లో మెరుస్తోంది. ప్రియాంక హాట్‌గా కనిపించిన ప్రతిసారి ఆమెకు సోషల్ మీడియాలో ట్రోలింగ్ ఎదురవుతోంది. తాజాగా భర్త నిక్‌తో కలిసి గ్రామీ అవార్డుల వేడుకకు ప్రియాంక హాజరైంది. క్రీమ్ కలర్ డ్రెస్‌లో భారీగా అందాలను ఆరబోస్తూ ప్రియాంక కనువిందు చేసింది.
 
ఆ ఫొటోలను తన సోషల్ మీడియా ఖాతాల్లో షేర్ చేసింది. అప్పట్నుంచి ఆమెకు ట్రోలింగ్ మొదలైంది. `ప్రియాంక భారత్ పరువుతీస్తోంది`, `ప్రియాంక దిగజారిపోయింది`, `ప్రియాంక డిజైనర్లకు డ్రెస్ డిజైన్ చేయడం రాదు` అంటూ పలువురు ఆమెపై విమర్శలు చేశారు. సోషల్ మీడియా ట్రోలింగ్‌పై తాజాగా ప్రియాంక స్పందించింది. `గ్రామీ అవార్డుల వేడుక కోసం నేను ధరించిన డ్రెస్‌పై చాలా ట్రోలింగ్ జరిగింది. అందరూ అనుకుంటున్నట్టు నేను అందాలు ఆరబోయలేదు. స్కిన్ కలర్‌లో ఉండే ఒకరకమైన క్లాత్ వేసుకుని.. దానిపై క్రీమ్ కలర్ డ్రెస్ వేసుకున్నాను. అది ఎవరికీ తెలియదు. కెమేరాలు కూడా కనిపెట్టలేవు. వేసుకున్న డ్రెస్‌కు సంబంధించి అన్ని జాగ్రత్తలూ తీసుకున్న తర్వాతే ఇంటి నుంచి బయటకు వస్తాన`ని ప్రియాంక చెప్పింది.

Updated Date - 2020-02-03T21:45:53+05:30 IST