కల నెరవేరుతుందని ఆశిస్తున్నా

ABN , First Publish Date - 2020-09-29T06:46:10+05:30 IST

బాలీవుడ్‌ నటులు రాజ్‌ కపూర్‌, దిలీప్‌ కుమార్‌ల పూర్వీకుల ఇళ్లను కొనుగోలు చేయాలని పాకిస్తాన్‌లోని ఖైబర్‌ పఖ్తున్ఖ్వా ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే...

కల నెరవేరుతుందని ఆశిస్తున్నా

బాలీవుడ్‌ నటులు రాజ్‌ కపూర్‌, దిలీప్‌ కుమార్‌ల పూర్వీకుల ఇళ్లను కొనుగోలు చేయాలని పాకిస్తాన్‌లోని ఖైబర్‌ పఖ్తున్ఖ్వా ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే! పెషావర్‌ నగరం నడిబొడ్డున ఉన్న ఈ రెండు భవనాలకు వందేళ్ల చరిత్ర ఉంది. అయితే శిథిలావస్థలో ఉన్న వీటిని కూల్చివేయకుండా సంరక్షించాలని అక్కడి పురావస్తు శాఖ యోచిస్తోంది. ఈ రెండు భవనాలను కొనుగోలు చేయడానికి నిధులు కేటాయించాలని నిర్ణయించుకున్న నేపథ్యంలో దిలీప్‌కుమార్‌ భార్య సైరాబాను హర్షం వ్యక్తం చేశారు. ‘‘రాజ్‌ కపూర్‌, దిలీప్‌ కుమార్‌ పూర్వీకులకు చెందిన చారిత్రాత్మక భవనాలను సంరక్షించడంలో అక్కడి ప్రభుత్వాలు చేస్తున్న ప్రయత్నం సఫలం కావాలి. ఈసారైనా కల నెరవేరుతుందని ఆశిస్తున్నా’’ అని సైరాబాను అన్నారు. 


Updated Date - 2020-09-29T06:46:10+05:30 IST