15న హిప్‌హాప్‌ ఆది ఆల్బమ్

ABN , First Publish Date - 2020-08-10T22:32:25+05:30 IST

ఎనిమిదేళ్ళ క్రితం ‘హిప్‌హాప్‌ తమిళా’ ఆల్బమ్‌తో తమిళ ప్రజలను ఆకట్టుకున్న సంగీత కళాకారుడు ఆది. ఆ తర్వాత పలు చిత్రాలకు సంగీతం సమకూర్చారు.

15న హిప్‌హాప్‌ ఆది ఆల్బమ్

ఎనిమిదేళ్ళ క్రితం ‘హిప్‌హాప్‌ తమిళా’ ఆల్బమ్‌తో తమిళ ప్రజలను ఆకట్టుకున్న సంగీత కళాకారుడు ఆది. ఆ తర్వాత పలు చిత్రాలకు సంగీతం సమకూర్చారు. ‘మీసై మురుక్కు’ చిత్రం ద్వారా నటుడిగా పరిచయమయ్యారు. ‘నట్పే తునై’, ‘నాన్‌ సిరిత్తాల్‌’ పేరుతో రెండు సినిమాలను కూడా నిర్మించారు.  ప్రస్తుతం నటుడిగా సంగీత దర్శకుడిగా కూడా వ్యవహిస్తున్నారు. ఈ నేపథ్యంలో స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ‘నాన్‌ ఒరు ఏలియన్‌’ పేరుతో ఓ మ్యూజిక్‌ ఆల్బమ్‌ రూపొందిస్తున్నారు. ఆ ఆల్బమ్‌లోని ఓ పాట ఇటీవల సోషల్‌ మీడియాలో విడుదలై సంచలనం కలిగించింది. పూర్తి ఆల్బమ్‌ను ఈ నెల 15న విడుదల చేయనున్నట్లు ఆది తెలిపారు.

Updated Date - 2020-08-10T22:32:25+05:30 IST