హిప్‌హాప్‌ హోస్ట్‌గా విజయ్‌, కృతీ

ABN , First Publish Date - 2020-11-06T05:30:00+05:30 IST

ఇండియాలో తొలి, ఏకైక హిప్‌ హాప్‌ డ్యాన్స్‌ లీగ్‌ షో ‘బ్రీజర్‌ వివిడ్‌ షఫుల్‌ సీజన్‌- 4’కు తెలుగు నటుడు విజయ్‌దేవరకొండ, బాలీవుడ్‌ నటి కృతీసనన్‌ బ్రాండ్‌ అంబాసిడర్లుగా ఎంపికయ్యారు. ఐదు నెలల పాటు జరిగే ఈ షోకు వారు హోస్ట్‌లుగా వ్యవహరిస్తారు....

హిప్‌హాప్‌ హోస్ట్‌గా విజయ్‌, కృతీ

ఇండియాలో తొలి, ఏకైక హిప్‌ హాప్‌ డ్యాన్స్‌ లీగ్‌ షో ‘బ్రీజర్‌ వివిడ్‌ షఫుల్‌ సీజన్‌- 4’కు తెలుగు నటుడు విజయ్‌దేవరకొండ, బాలీవుడ్‌ నటి కృతీసనన్‌ బ్రాండ్‌ అంబాసిడర్లుగా ఎంపికయ్యారు. ఐదు నెలల పాటు జరిగే ఈ షోకు వారు హోస్ట్‌లుగా వ్యవహరిస్తారు.  దేశంలోని మారుమూల ప్రాంతాలకు చెందిన ప్రతిభావంతులైన వీధి డ్యాన్సర్లను వెలుగులోకి తెచ్చేందుకు ఏటా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఈ ఏడాది హిప్‌ హాప్‌ డ్యాన్స్‌తో పాటు మ్యూజిక్‌, ఆర్ట్‌, కళారూపాల్లోనూ పోటీలు ఉంటాయి. విజేతకు రూ. 20 లక్షల నగదు పురస్కారం అందిస్తారు. సీజన్‌ 4లో పాల్గొనాలనుకునే డ్యాన్సర్లు డిసెంబర్‌ 21దాకా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. జనవరి 17 నుంచి ఆన్‌లైన్‌ ఆడిషన్స్‌ జరుగుతాయి.

Updated Date - 2020-11-06T05:30:00+05:30 IST