ఆ ‘బొమ్మరిల్లు’కి దుమ్ము దులుపుతున్నారు

ABN , First Publish Date - 2020-11-06T03:25:04+05:30 IST

హీరో సిద్ధార్థ్‌, జెనీలియా హీరోహీరోయిన్లుగా బొమ్మరిల్లు భాస్కర్‌ దర్శకత్వంలో రూపొందిన చిత్రం 'బొమ్మరిల్లు'. ఈ చిత్రం విడుదల తర్వాత దర్శకుడి పేరే బొమ్మరిల్లు

ఆ ‘బొమ్మరిల్లు’కి దుమ్ము దులుపుతున్నారు

హీరో సిద్ధార్థ్‌, జెనీలియా హీరోహీరోయిన్లుగా బొమ్మరిల్లు భాస్కర్‌ దర్శకత్వంలో రూపొందిన చిత్రం 'బొమ్మరిల్లు'. ఈ చిత్రం విడుదల తర్వాత దర్శకుడి పేరే బొమ్మరిల్లు భాస్కర్‌గా మారిపోయింది. ఇక ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద సంచలన విజయం అందుకున్న విషయం తెలిసిందే. 2006లో ఈ చిత్రం రూపుదిద్దుకుంది. దిల్‌ రాజు నిర్మించిన ఈ చిత్రాన్ని.. 2007లో హిందీలో రీమేక్‌ చేశారు. అందులో కూడా హీరోయిన్‌ జెనీలియానే. సిద్ధార్థ్‌ పాత్రలో హర్మన్ బవేజా నటించగా.. ప్రకాశ్‌ రాజ్‌ పాత్రలో స్టార్‌ నటుడు నానా పటేకర్‌ నటించారు. అనీజ్‌ బజ్మీ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం.. చిత్రీకరణ పూర్తయినా కూడా అప్పట్లో విడుదలకు నోచుకోలేదు.


2007లో తెరకెక్కిన ఈ చిత్రాన్ని దాదాపు 13 సంవత్సరాల తర్వాత విడుదల చేయబోతున్నారు. 'ఇట్స్‌ మై లైఫ్‌' పేరుతో విడుదల కాబోతోన్న ఈ చిత్రాన్ని బోనీకపూర్‌తో పాటు జీ సినిమా సంయుక్తంగా విడుదల చేయబోతోంది. 'ఇట్స్‌ మై లైఫ్‌' చిత్రాన్ని నవంబర్‌ 29న జీ సినిమా ఛానల్‌లో విడుదల చేస్తున్నట్లుగా చిత్రయూనిట్‌ అధికారికంగా ప్రకటించింది. అప్పుడు తెరకెక్కిన ఈ సినిమా.. ఇప్పుడు ఎటువంటి రిజల్ట్ అందుకుంటుందో చూద్దాం. ఇక అందులో నటించిన జెనీలియా మాత్రం ఇప్పుడు తన ఇద్దరి పిల్లలతో కలిసి ఈ సినిమా చూసి ఎలా ఫీలవుతుందో.. అని నెటిజన్లు ఆసక్తికరంగా స్పందిస్తుండటం విశేషం.Updated Date - 2020-11-06T03:25:04+05:30 IST