అత్యాచారాలపై ఎమ్మెల్యే వ్యాఖ్యలు.. హీరోయిన్స్ ఫైర్!

ABN , First Publish Date - 2020-10-05T17:56:26+05:30 IST

తల్లిదండ్రులు తమ కూతుళ్లకు మంచి విలువలు నేర్పాలని, అప్పుడే ఈ దేశంలో అత్యాచారాలు తగ్గుతాయ

అత్యాచారాలపై ఎమ్మెల్యే వ్యాఖ్యలు.. హీరోయిన్స్ ఫైర్!

తల్లిదండ్రులు తమ కూతుళ్లకు మంచి విలువలు నేర్పాలని, అప్పుడే ఈ దేశంలో అత్యాచారాలు తగ్గుతాయని వ్యాఖ్యానించిన యూపీకి చెందిన బీజేపీ ఎమ్మెల్యే సురేంద్ర సింగ్‌పై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సురేంద్ర సింగ్ వ్యాఖ్యలపై పలువురు బాలీవుడ్ హీరోయిన్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. సురేంద్ర వ్యాఖ్యలపై హీరోయిన్ స్వర భాస్కర్ స్పందిస్తూ.. `అసహ్యకరమైన ముసలి పాపి` అని కామెంట్ చేసింది. 


ఇక, హీరోయిన్ కృతి సనోన్ స్పందిస్తూ.. `అత్యాచారానికి గురవకుండా ఎలా ఉండాలో కూతుళ్లకు నేర్పాలా? అతనేం చెప్పాడో అతనికైనా అర్థమైందా? ఇలాంటి ఆలోచనా ధోరణులు మారాలి. కొడుకులకు ఎందుకు కాస్త సంస్కారం నేర్పరు` అని పేర్కొంది. ఇక పూజా బేడి స్పందిస్తూ.. `అధికార పార్టీలో ఇలాంటి మూర్ఖులు, పురుషాహంకారులు చాలా మంది ఉన్నారు. ప్రక్షాళనకు సమయం ఆసన్నమైంది.. కదా?` అని ట్వీట్ చేసింది.   
Updated Date - 2020-10-05T17:56:26+05:30 IST

Read more