లాక్‌డౌన్‌లోరహస్య వివాహమా..?యషిక స్పందన

ABN , First Publish Date - 2020-08-04T15:37:23+05:30 IST

పచ్చరంగు పట్టుచీర కట్టి, కుంకుమ బొట్టుతో ఉన్న యషిక ఫోటోలను చూసిన అభిమానులు దిగ్ర్భాంతి చెందారు. లాక్‌డౌన్‌ కాలంలో నిరాండంబరంగా యషిక రహస్య వివాహం చేసుకుందని అనుమానించారు.

లాక్‌డౌన్‌లోరహస్య వివాహమా..?యషిక స్పందన

‘ఇరట్టు అరైయిల్‌ మురట్టు కుత్తు’ చిత్రం ద్వారా యువత మనసులను దోచుకున్న యషిక,  బిగ్‌బాస్‌ రియాల్టీ షో ద్వారా మరింత క్రేజ్ సంపాదించుకున్నారు. ప్రస్తుతం సినిమాలు, సీరియల్స్‌లో నటిస్తున్న యషిక, తన ట్విట్టర్‌లో గ్లామర్‌స్‌ ఫోటోలను పోస్ట్‌ చేస్తోంది. ఆమె ట్విట్టర్‌కు సుమారు 2 లక్షల మంది ఫాలోవర్స్‌ ఉన్నారు. ట్విట్టర్‌లో తరచు పలు భంగిమల్లో ఫొటోలు పోస్ట్‌ చేస్తున్న ఆమె తాజాగా పోస్ట్‌ చేసిన ఫొటోలు అందర్నీ ఆకట్టుకుంటున్నాయి. పచ్చరంగు పట్టుచీర కట్టి, కుంకుమ బొట్టుతో ఉన్న యషిక ఫోటోలను చూసిన అభిమానులు దిగ్ర్భాంతి చెందారు. లాక్‌డౌన్‌ కాలంలో నిరాండంబరంగా యషిక రహస్య వివాహం చేసుకుందని అనుమానించారు. సోషల్‌ మీడియాలో ఆమె రహస్య వివాహం చేసు కుందని పుకార్లు వ్యాపించాయి. దీనిపై స్పందించిన యషిక ఆ ఫొటోలు ఓ సినిమా షూటింగ్‌ కోసం తీసినవనీ, తానింకా పెళ్ళి చేసుకోలేదేని స్పష్టం చేసింది.


Updated Date - 2020-08-04T15:37:23+05:30 IST