కరెంట్ బిల్స్ చూసి బిత్తరపోయిన తాప్సీ

ABN , First Publish Date - 2020-06-28T23:27:00+05:30 IST

కరోనా మహమ్మారి కారణంగా అన్ని చోట్లా మూడు నెలల కరెంట్ వాడకాన్ని కలిపి ఒకటే బిల్లును ఇస్తున్న విషయం తెలిసిందే. దీంతో శ్లాబ్‌లు మారి ప్రతి ఒక్కరికీ

కరెంట్ బిల్స్ చూసి బిత్తరపోయిన తాప్సీ

కరోనా మహమ్మారి కారణంగా అన్ని చోట్లా మూడు నెలల కరెంట్ వాడకాన్ని కలిపి ఒకటే బిల్లును ఇస్తున్న విషయం తెలిసిందే. దీంతో శ్లాబ్‌లు మారి ప్రతి ఒక్కరికీ భారీగా చార్జీలు పడ్డాయి. వందలలో వచ్చే వారికి వేలల్లో, అలాగే వేలల్లో వచ్చేవారికి లక్షల్లో బిల్లులు వచ్చాయి. అదేమంటే సమాధానం ఒక్కటే మూడు నెలల బిల్లులను మంత్లీ డివైడ్ చేశాం. అంతే వస్తుంది కట్టాల్సిందే అంటున్నారు. ఈ మధ్య తమిళనాడులో నటి స్నేహ భర్త ప్రసన్న తన కరెంట్ బిల్ చూపిస్తూ ఫైర్ అయిన విషయం తెలిసిందే. రీసెంట్‌గా హీరోయిన్ కార్తీక తనకు వచ్చిన కరెంట్ బిల్ చూసి ఒక్కసారిగా షాకై.. ఇదేం స్కామ్ అంటూ ముంబై అదానీ ఎలక్ట్రిసిటీని ప్రశ్నించింది. ఇక ఇప్పుడు తాప్సీ వంతు.


తనకు ఎప్పుడూ వచ్చే బిల్ కంటే మూడు రెట్లు అధికంగా కరెంట్ బిల్ వచ్చినట్లుగా బిల్స్‌ను కూడా తాప్సీ ట్విట్టర్‌లో పోస్ట్ చేసింది. ఆ బిల్స్‌లో ఉన్న అమౌంట్ చూసి షాక్‌కి లోనైనట్లుగా తాప్సీ పేర్కొంది. తన అపార్ట్‌మెంట్‌కి ఎప్పుడోకానీ వెళ్లదట. అదీ కూడా క్లీనింగ్ కోసమేనట. అలాంటిది.. ఆ అపార్ట్‌మెంట్‌కి వచ్చిన బిల్స్ చూస్తుంటే.. తను కాకుండా ఇంకా ఎవరైనా అందులో నివసిస్తున్నారా? అనే అనుమానం తాప్సీ వ్యక్తం చేసింది. ముంబై అదానీ ఎలక్ట్రిసిటీ సంస్థ తనకు ఏవిధంగా ఇంత అమౌంట్ చార్జ్ చేసిందో తెలియజేయాలంటూ తాప్సీ ఆవేదన వ్యక్తం చేసింది.Updated Date - 2020-06-28T23:27:00+05:30 IST