నాకు ఇవ్వాల‌నిపించిన‌ప్పుడే విరాళం ఇస్తా: శృతిహాసన్

ABN , First Publish Date - 2020-04-20T23:37:01+05:30 IST

హీరోయిన్ శృతిహాసన్ ఏదైనా సరే ముక్కుసూటిగా సమాధానం ఇస్తుంటుంది. ఆఖరికి తను డ్రింక్ చేసే విషయం గురించి చెప్పేందుకు కూడా ఆమె వెనుకాడలేదు. అలాంటి మనస్థత్వం

నాకు ఇవ్వాల‌నిపించిన‌ప్పుడే విరాళం ఇస్తా: శృతిహాసన్

హీరోయిన్ శృతిహాసన్ ఏదైనా సరే ముక్కుసూటిగా సమాధానం ఇస్తుంటుంది. ఆఖరికి తను డ్రింక్ చేసే విషయం గురించి చెప్పేందుకు కూడా ఆమె వెనుకాడలేదు. అలాంటి మనస్థత్వం శృతిహాసన్‌ది. తాజాగా ఆమెపై సోషల్ మీడియాలో ఓ ట్రోలింగ్ జరుగుతుంది. అదేమంటే ఈ కరోనా సంక్షోభంలో సెలబ్రిటీలందరూ ఎంతో కొంత విరాళం ఇచ్చి.. ప్రజలను, ప్రభుత్వాలను ఆదుకునే ప్రయత్నం చేస్తున్నారు. మీరు కూడా ఏదైనా సమాజానికి పనికివచ్చే పనో.. లేదంటే ఎంతో కొంత విరాళమో ఇవ్వవచ్చుగా అనే ప్రశ్నలతో నెటిజన్లు శృతిహాసన్‌ను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు. అయితే ఇలాంటి ప్రశ్నలకు శృతి కూడా ఏమాత్రం జంకకుండా ధీటుగా సమాధానం ఇస్తుంది. 


ఈ టైమ్‌లో సమాజానికి సేవ చేయండి అని కొందరు, మీరు కూడా విరాళం ఇవ్వండి అని మరికొందరు నాకు సలహాలు ఇస్తున్నారు. నాకు సలహాలు ఇచ్చే వారందరినీ నేను ఒక్కటే అడగదలుచుకున్నాను. మీరు ఏం సేవ చేస్తున్నారు? మీరు ఎంత విరాళం ఇచ్చారు? కనీసం ప్రభుత్వం ఇంట్లోనే ఉండండి అని చెబుతున్నా.. ఎవ్వరూ పట్టించుకోవడం లేదు. అలాంటి వాళ్లా.. నాకు సలహాలు ఇచ్చేది? అయినా ఎవరో చెబితేగానీ విరాళం ఇవ్వాల్సిన ఖర్మ నాకు పట్టలేదు. నాకు ఎప్పుడు ఇవ్వాలని అనిపిస్తుందో.. అప్పుడే ఇస్తా. దయచేసి ఉచిత సలహాలు ఇవ్వడం మానుకోండి.. అని చాలా స్ట్రాంగ్‌గా కౌంటరిచ్చింది శృతిహాసన్.

Updated Date - 2020-04-20T23:37:01+05:30 IST