‘ప్రెజర్’పై పాఠం చెబుతున్న ప్రభాస్ పోరి

ABN , First Publish Date - 2020-05-11T06:06:12+05:30 IST

ప్రభాస్‌తో ‘సాహో’ అంటూ తెలుగువారిని పలకరించి వారి చేత ఆహా అనిపించుకుంది శ్రద్ధాకపూర్‌. అవడానికి ఉత్తరాది అమ్మాయే అయినా ఒక్క సినిమాతోనే ఆమెను

‘ప్రెజర్’పై పాఠం చెబుతున్న ప్రభాస్ పోరి

ప్రభాస్‌తో ‘సాహో’ అంటూ తెలుగువారిని పలకరించి వారి చేత ఆహా అనిపించుకుంది శ్రద్ధాకపూర్‌. అవడానికి ఉత్తరాది అమ్మాయే అయినా ఒక్క సినిమాతోనే ఆమెను తెలుగువారు ఎంతగానో ఆరాధించారు. చూడడానికి సామాన్యమైన అందచందాలతో, ఓ మోస్తరు ఎత్తుతో ఉండే శ్రద్ధా కపూర్‌ వ్యక్తిత్వంలో మాత్రం అందనంత ఎత్తులో ఉంటుంది. ఏ విషయాన్నైనా ముక్కు సూటిగా చెప్పేస్తుంది. అయితే తను అలా ఉండడానికి కారణం తనమీద ఒత్తిడి లేకపోవడమే అని చెబుతుంది. అంతే కాదు ఒత్తిడి లేకుండా ఉండటానికి తనేం చేస్తుందో ఓ పాఠంలా తెలిపింది శ్రద్ధా కపూర్‌.


‘‘ఈ పెద్ద ప్రశ్నకు చిన్న సమాధానం... పని. పని మీద ప్రేమ ఉంటే... ఒత్తిడే ఉండదు. చాలా మంది పనిచేసేటప్పుడు ఒత్తిడికి గురవుతామని చెబుతుంటారు. నాకు మాత్రం అలా అనిపించదు. షూటింగ్‌లో సీన్‌ను ఎలా చేయాలన్న దాని గురించే ఆలోచిస్తాను. అప్పుడు కూడా ఒత్తిడిగా అనిపించదు. ఏదైనా మన ఆలోచన బట్టే ఒత్తిడి అనేది ఉంటుందని నేను అనుకుంటాను. ఒత్తిడిని దూరంగా ఉంచడానికి మరో మార్గం కుటుంబ సభ్యులతో ఎక్కువసేపు గడపడం. ఈ పని నేను ఎక్కువగా చేస్తుంటాను..’’ అని శ్రద్ధా చెప్పుకొచ్చింది.

Updated Date - 2020-05-11T06:06:12+05:30 IST