నేను మందు కొడతా.. అందులో తప్పేముంది: హీరోయిన్

ABN , First Publish Date - 2020-03-04T21:12:16+05:30 IST

నాకు మద్యం సేవించడమంటే చాలా ఇష్టం. అయితే తాగాక ఎవరినీ ఇబ్బంది పెట్టను.

నేను మందు కొడతా.. అందులో తప్పేముంది: హీరోయిన్

`నాకు మద్యం సేవించడమంటే చాలా ఇష్టం. అయితే తాగాక ఎవరినీ ఇబ్బంది పెట్టను. కాకపోతే కాస్త ఎక్కువ మాట్లాడతానంతే`.. ఇలా చెప్పింది ఎవరో తెలుసా? మలయాళ చిత్ర పరిశ్రమకు చెందిన ఓ హీరోయిన్. పేరు వీణా నందకుమార్. తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన వీణ తన తాగుడు గురించి కుండబద్దలు కొట్టినట్టు మాట్లాడింది.


`నేను బీర్లు చాలా ఎక్కువగా తాగుతా. అది నేరమేమీ కాదు కదా! తాగాక నేను ఎవరినీ ఇబ్బంది పెట్టను. నేను మద్యం సేవించడం వల్ల మరెవ్వరికో నష్టం లేదు. కాబట్టి ఈ విషయంలో నన్ను విమర్శించే హక్కు ఎవరికీ లేదు. నేను నా వ్యక్తిగత అవసరం కోసం తాగుతున్నాను. అయినా ఇప్పుడు అందరూ తాగుతున్నారు కదా! నేను కూడా అంతే. నా అలవాటు గురించి బయటకు చెప్పేందుకు నేను భయపడన`ని వీణ చెప్పింది. కాగా, వీణ వ్యాఖ్యల పట్ల సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 


Updated Date - 2020-03-04T21:12:16+05:30 IST

Read more