ఇది టైప్ చేస్తుంటే నా చేతులు వణుకుతున్నాయి: ప్రణీత

ABN , First Publish Date - 2020-06-08T02:36:26+05:30 IST

యాక్షన్ కింగ్ అర్జున్ మేనల్లుడు, ప్రముఖ కన్నడ నటుడు చిరంజీవి సర్జా ఈ రోజు(ఆదివారం) మధ్యాహ్నం 3 గంటలకు గుండెపోటుతో మృతి చెందారు. సడెన్‌గా

ఇది టైప్ చేస్తుంటే నా చేతులు వణుకుతున్నాయి: ప్రణీత

యాక్షన్ కింగ్ అర్జున్ మేనల్లుడు, ప్రముఖ కన్నడ నటుడు చిరంజీవి సర్జా ఈ రోజు(ఆదివారం) మధ్యాహ్నం 3 గంటలకు గుండెపోటుతో మృతి చెందారు. సడెన్‌గా గుండెపోటు రావడంతో బంధువులు అతనిని అపోలో ఆస్పత్రిలో చేర్పించారు. అయితే అప్పటికే చిరంజీవి సర్జా గుండెపోటుతో చనిపోయినట్లు వైద్యులు ధ్రువీకరించారు. అతని వయసు 39 సంవత్సరాలు. చిరంజీవి సర్జా ఇప్పటివరకూ 19 సినిమాల్లో నటించారు. 1980 అక్టోబర్ 17న బెంగళూరులో జన్మించిన చిరంజీవి సర్జా తొలి నాళ్లలో అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేశారు. ఆ తర్వాత నటుడిగా మారారు. అతని సోదరుడు నటుడు ధ్రువ సర్జా కన్నడనాట హీరోగా రాణిస్తున్నారు. చిరంజీవి సర్జాకు రెండేళ్ల క్రితమే వివాహమైంది. నటి మేఘనా రాజ్‌ను ఆయన పెళ్లి చేసుకున్నారు. చిరంజీవి సర్జా ఆకస్మిక మరణంతో కన్నడ సినీ పరిశ్రమ తీవ్ర దిగ్భ్రాంతికి లోనైంది. 


చిరంజీవి సర్జా మరణవార్త విన్న నాకు మాటలు రాలేదని, షాక్‌కు గురయ్యానని తెలిపారు నటి ప్రణీత. ట్విట్టర్ ద్వారా స్పందించిన ఆమె.. ‘‘చిరు యొక్క అకాల మరణవార్త విని మాటలు రాలేదు. షాక్‌కి లోనయ్యాను. ఇది టైపు చేస్తుంటే నా చేతులు వణుకుతున్నాయి. అతను అద్భుతమైన సహనటుడే కాకుండా మానవత్వం ఉన్న మంచి మనిషి కూడా. ఆయన జీవితానికి అన్యాయం జరిగింది. మేఘనకు, అర్జున్ సర్జా కుటుంబ సభ్యులకు మరియు స్నేహితులకు మనో ధైర్యం చేకూరాలని ఆ దేవుళ్ళను ప్రార్థిస్తూ, నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను.. ఓం శాంతి..’’ అని ప్రణీత తన ట్వీట్‌లో పేర్కొన్నారు.Updated Date - 2020-06-08T02:36:26+05:30 IST