లావణ్య త్రిపాఠి కూడా రెడీ అంటుంది

ABN , First Publish Date - 2020-05-11T22:54:01+05:30 IST

కొందరు హీరోయిన్లకి కరెన్సీనే ముఖ్యం. మరికొందరికి మాత్రం కథలో తన పాత్రే ముఖ్యం. వీటిలో రెండో కోవకి చెందుతుందీ అందాల రాక్షసి. బికినీ వేసినా, మలయాళ తీరం చేరినా, అంతర్జాలంలో

లావణ్య త్రిపాఠి కూడా రెడీ అంటుంది

కొందరు హీరోయిన్లకి కరెన్సీనే ముఖ్యం. మరికొందరికి మాత్రం కథలో తన పాత్రే ముఖ్యం. వీటిలో రెండో కోవకి చెందుతుందీ అందాల రాక్షసి. బికినీ వేసినా, మలయాళ తీరం చేరినా, అంతర్జాలంలో అరంగేట్రం చేసినా అన్నీ కంటెంట్ కోసమే అంటుందీ అందాల భామ. లావణ్య అనే పేరుకి సరిగ్గా సరిపోయే రూపం లావణ్య త్రిపాఠిది. ఉత్తరాది నుంచి వచ్చిన ఈ భామ కుర్రాళ్లకు అందాల రాక్షసిగా మారిపోయింది. కానీ ఎక్కడో తేడా కొట్టేసింది. ఇంత వరకూ స్టార్ హీరోయిన్ స్టేటస్‌ను అందుకోలేకపోయింది. అలాగని చెప్పుకోదగ్గ సినిమాల్లో చేయలేదా అంటే.. చక్కటి చిత్రాల్లో కనువిందు చేసింది కానీ అదృష్టం మాత్రం ఆమె పంచన చేరలేదు.


నాని మొదలు నాగార్జున వరకు చాలా మంది హీరోలతో హిట్స్ కొట్టింది లావణ్య త్రిపాఠి. కానీ ఆ మధ్య వరుసగా ఫ్లాప్స్ ఎదురై.. డీలా పడిపోయింది. అయితే హీరో నిఖిల్‌తో చేసిన ‘అర్జున్ సురవరం’ ఎట్టకేలకు అమ్మడుని కాస్త ఊపిరి పీల్చుకునేలా చేసింది. అయితే లావణ్య మొదటి నుంచి ఇతర కమర్షియల్ హీరోయిన్లతో పోలిస్తే కొంచెం భిన్నం అనే చెప్పాలి. సాధారణంగా ముంబై హీరోయిన్లు స్కిన్ షో‌కు పెద్దగా వెనుకాడరు. కానీ సినిమాలో తన పాత్రకు ఎంతో కొంత ప్రాముఖ్యత ఉంటేనే లావణ్య అంగీకరిస్తూ వస్తుంది. అందువల్ల కూడా కెరీర్‌లో జోరు చూపించలేకపోయింది. 


ఇప్పటి వరకు ప్రయాణం ఎలా ఉన్నా.. ఇక ముందు దూసుకుపోవాలని అనుకుంటుందట లావణ్య. బికినీ ధరించడానికి వ్యతిరేకం కాదంటూ స్టేట్‌మెంట్ ఇచ్చేసింది. గ్లామర్ పండించడానికి సరిపడిన బలమైన కథ ఉంటే బికినీకైనా సిద్ధమని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో లావణ్య తెలిపింది. అలాగే వెబ్ సిరీస్ ట్రెండ్ మెలమెల్లగా టాలీవుడ్‌లో పెరుగుతుంది కాబట్టి.. మంచి కథతో వస్తే డిజిటల్ స్ర్కీన్‌పై తన సత్తా చాటుతానంటుంది. ఇక లావణ్య మరో కోరిక కూడా బయటపెట్టింది. మలయాళ సినిమాలు సూపర్బ్‌గా ఉంటాయట. వాటిలో హీరోయిన్ రోల్స్ కూడా అద్భుతంగా తీర్చిదిద్దుతారట. అందుకే మలయాళంలో అవకాశాలు వస్తే.. తప్పకుండా చేస్తానంటూ ఓపెన్ ఆఫర్ ఇస్తుంది లావణ్య. మరి ఇంతగా ఓపెన్ అయిన లావణ్య మాటల్ని ఎవరు ఆలకిస్తారో చూద్దాం.

Updated Date - 2020-05-11T22:54:01+05:30 IST