బ్యూటీ సీక్రెట్‌ చెప్పిన కియారా అద్వానీ

ABN , First Publish Date - 2020-09-16T03:53:43+05:30 IST

తెలుగులో 'భరత్‌ అనే నేను', 'వినయ విధేయ రామ' చిత్రాలతో హీరోయిన్‌గా తళుక్కున మెరిసిన భామ కియారా అద్వానీ. ఆ రెండు సినిమాల

బ్యూటీ సీక్రెట్‌ చెప్పిన కియారా అద్వానీ

తెలుగులో 'భరత్‌ అనే నేను', 'వినయ విధేయ రామ' చిత్రాలతో హీరోయిన్‌గా తళుక్కున మెరిసిన భామ కియారా అద్వానీ. ఆ రెండు సినిమాల తర్వాత ఆమె టాలీవుడ్‌లో నెంబర్‌ వన్‌ హీరోయిన్‌గా నిలబడుతుందని అంతా అనుకున్నారు. కానీ ఆమె ఫోకస్‌ అంతా బాలీవుడ్‌పై పెట్టడంతో, టాలీవుడ్‌లో అవకాశాలు వచ్చినా కూడా కాదనుకుంది. ఇప్పుడు బాలీవుడ్‌ మోస్ట్ బిజీ హీరోయిన్ ఎవరైనా ఉన్నారా? అంటే అది ఖచ్చితంగా కియారానే.


తాజాగా కియారా అద్వానీ తన బ్యూటీ సీక్రెట్‌ను రివీల్‌ చేసింది. తన చర్మం సమస్యలకు గురి కాకుండా ఉండేందుకు తక్కువ మేకప్‌, హోం రెమెడీస్‌ను మాత్రమే వాడే కియారా.. తన చర్మ సౌందర్యానికి రహస్యం వాళ్ల అమ్మమ్మ నుంచి నేర్చుకున్న రెసిపీనే అని తెలిపింది. "కొద్దిగా తేనె, శనగపిండి, క్రీమ్‌, పాలు మరియు నిమ్మరసం కలిపిన మిశ్రమాన్ని నా ముఖంపై కొన్ని నిమిషాల పాటు ఉంచుతాను. ఇది నిజంగా నన్ను రిఫ్రెష్‌ చేయడమే కాకుండా నా చర్మం ఎప్పుడూ మెరిసేలా చేస్తుంది.." అని తెలిపింది కియారా అద్వానీ.  ఎప్పుడూ ఫ్రెష్‌గా ఉండటమే కాకుండా అందంగా కూడా కియారా అందరినీ ఆకర్షిస్తోంది. మరి ఆమె అందానికి సీక్రెట్‌ ఏమిటో చెప్పేసింది కాబట్టి.. కియారా చెప్పిన చిట్కాను ఇకపై అందరూ పాటిస్తారేమో చూద్దాం.

Updated Date - 2020-09-16T03:53:43+05:30 IST