అందరిలో స్ఫూర్తి నింపుతోన్న ‘అందాల మేనక’

ABN , First Publish Date - 2020-10-18T02:44:24+05:30 IST

ఒకప్పుడు కుర్రకారును 'అందాల మేనక'గా ఆకర్షించిన జ్యోతిక పుట్టినరోజు అక్టోబర్ 18. ఈ సందర్భంగా జ్యోతికకు విషెస్ చెబుతూ ఆమె బాణీని గుర్తు చేసుకుందాం. ముద్దుగా బొద్దుగా

అందరిలో స్ఫూర్తి నింపుతోన్న ‘అందాల మేనక’

ఒకప్పుడు కుర్రకారును 'అందాల మేనక'గా ఆకర్షించిన జ్యోతిక పుట్టినరోజు అక్టోబర్ 18. ఈ సందర్భంగా జ్యోతికకు విషెస్ చెబుతూ ఆమె బాణీని గుర్తు చేసుకుందాం. ముద్దుగా బొద్దుగా ఉంటూ తమిళ తంబీలను విశేషంగా ఆకట్టుకుంది ముద్దుగుమ్మ జ్యోతిక. ఆ పైన తెలుగు చిత్రాలలోనూ స్టార్ హీరోస్‌తో నర్తించి మురిపించింది. తమిళనాట జ్యోతికకు జేజేలు పలికారు జనం. జ్యోతిక ఉందంటే చాలు థియేటర్లకు పరుగులు తీశారు. తెలుగునాట అంత కాకపోయినా, కొంతయినా ఆకట్టుకోగలిగింది జ్యోతిక. హీరో సూర్యని పెళ్లాడిన తర్వాత కొంతకాలంగా నటనకు దూరంగా ఉన్న జ్యోతిక మళ్లీ తనదరికి చేరిన పాత్రలతో అలరించే ప్రయత్నం చేస్తుంది.


పెళ్ళయి ఇద్దరు పిల్లల తల్లయిన తరువాత కొంతకాలం సినిమాలకు దూరంగా ఉన్న జ్యోతిక ఇప్పుడు మళ్ళీ నటిస్తోంది. అయితే మునుపటిలా అందాలతో అలరించలేకపోయినా, తన వయసుకు తగ్గ పాత్రలు పోషిస్తూ మెప్పిస్తోంది. అందుకు భర్త సూర్య ప్రోత్సాహం కూడా తోడయింది. లాక్ డౌన్ సమయంలో ఓటీటీలో విడుదలైన తొలి తమిళ సినిమా జ్యోతికదే! ఆ సినిమాతో పాటు ఆమె ఇటీవల నటించిన తమిళ చిత్రాలు సైతం లాక్ డౌన్ టైమ్‌లో తెలుగులో అనువాదమై ఓటీటీలో స్ట్రీమింగ్ జరుపుకున్నాయి. ఇల్లాలిగా, నటిగా రెండు బాధ్యతలు ఎంతో గొప్పగా నిర్వహిస్తూ.. అందరిలో స్ఫూర్తి నింపుతున్న జ్యోతిక మరిన్ని పుట్టినరోజులు ఆనందంగా జరుపుకోవాలని ఆశిద్ధాం.

Updated Date - 2020-10-18T02:44:24+05:30 IST