7వ రోజు.. అమలాపాల్‌ అవతారం చూశారా?

ABN , First Publish Date - 2020-10-25T03:18:12+05:30 IST

నటి అమలాపాల్‌లో చాలా కళలు ఉన్నాయి. ఇదేదో సెటైరిక్‌గా చెబుతున్న మాట కాదు! దసరా నవరాత్రులలో ఒక్కో రోజూ ఒక్కో అమ్మవారి గెటప్ లో అధునాతనంగా తనను తాను ప్రెజెంట్

7వ రోజు.. అమలాపాల్‌ అవతారం చూశారా?

నటి అమలాపాల్‌లో చాలా కళలు ఉన్నాయి. ఇదేదో సెటైరిక్‌గా చెబుతున్న మాట కాదు! దసరా నవరాత్రులలో ఒక్కో రోజూ ఒక్కో అమ్మవారి గెటప్ లో అధునాతనంగా తనను తాను ప్రెజెంట్ చేసుకుంటోంది అమలాపాల్. ఇంతవరకూ శైలపుత్రి, బ్రహ్మచారిణి, చంద్రఘట, కుసుమంద, స్కందమాత, కాత్యాయని, దేవి కాళరాత్రి గెటప్స్ లో అమలాపాల్ ఇచ్చిన ఫోజులు చూసి నెటిజన్లు ఫిదా అయిపోయారు. తాజాగా ఆమె కాళరాత్రి అవతారం గురించి, ఆ అవతారంలో అమ్మవారు ఉండే విధానం గురించి ఇన్‌స్టాగ్రమ్‌ ద్వారా తెలిపింది.


నవరాత్రులలో ఏడవ రోజు అమ్మవారు కాళరాత్రి  అవతారంలో భక్తులకు దర్శనం కల్పిస్తారు. పురాణాల ప్రకారం రాక్షస సంహారం చేయడానికి రంగును త్యాగం చేసి చీకటిని స్వీకరించడం ద్వారా అమ్మవారికి కాళరాత్రి అని పేరు వచ్చినట్లుగా చెప్పబడుతోంది. ఇదే విషయాన్ని అమలాపాల్‌ చెప్పింది. ఇక అమ్మవారి అవతారాలు చెబుతూ.. ఆమె పోస్ట్ చేస్తున్న పిక్‌లు మాత్రం వైరల్‌ అవుతున్నాయి. అందుకే అమలాపాల్‌లో చాలా కళలు దాగి ఉన్నాయని అన్నది.



Updated Date - 2020-10-25T03:18:12+05:30 IST