హీరోయిన్ అఖిల ఆకర్షణ పోస్టర్ వదిలిన రాజధాని ఆర్ట్ మూవీస్

ABN , First Publish Date - 2020-07-31T22:01:45+05:30 IST

హుషారు ఫేమ్ తేజ్ కూరపాటి, అఖిల ఆకర్షణ జంటగా కల్పనా రెడ్డి, తనికెళ్ళ భరణి, జీవ, జోగి బ్రదర్స్ ప్రధాన పాత్రలలో జి.వి.ఆర్ ఫిలిం మేకర్స్ సమర్పణలో, రాజధాని

హీరోయిన్ అఖిల ఆకర్షణ పోస్టర్ వదిలిన రాజధాని ఆర్ట్ మూవీస్

హుషారు ఫేమ్ తేజ్ కూరపాటి, అఖిల ఆకర్షణ జంటగా కల్పనా రెడ్డి, తనికెళ్ళ భరణి, జీవ, జోగి బ్రదర్స్ ప్రధాన పాత్రలలో జి.వి.ఆర్ ఫిలిం మేకర్స్ సమర్పణలో, రాజధాని ఆర్ట్ మూవీస్ నిర్మాణంలో ముల్లేటి కమలాక్షి గుబ్బల వేంకటేశ్వర రావు సంయుక్తంగా నిర్మిస్తున్న ప్రొడక్షన్ నెంబర్ 2 చిత్రం ఆహ్లాదకరమైన గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కుతోంది. హీరోయిన్ అఖిల ఆకర్షణ పుట్టినరోజు సందర్భంగా చిత్ర యూనిట్ అఖిల ఆకర్షణకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ చిత్రం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ పరిసర ప్రాంతాల్లో షూటింగ్ జరుపుకుంది.


ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ.. ‘‘దర్శకుడు ప్రతి సన్నివేశాన్ని అద్భుతంగా తెరకెక్కిస్తున్నాడు. సినిమా బాగా వచ్చింది, అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించే ఒక లవ్ స్టోరీగా ఈ సినిమా ఉండబోతోంది..’’ అని తెలిపారు.


దర్శకుడు వెంకట్ వందెల మాట్లాడుతూ.. ‘‘హుషారు సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న తేజ్ ఈ సినిమాలో మరో డిఫరెంట్ రోల్‌లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. అలాగే హీరోయిన్ అఖిల ఆకర్షణ ఈ సినిమాతో మంచి నటిగా గుర్తింపు తెచ్చుకోబోతోంది. నిర్మాతలు ఖర్చుకు వెనకాడకుండా ఎక్కడా కాంప్రమైజ్ కానివ్వకుండా సినిమా తీయడానికి పూర్తి సహకారం అందిస్తున్నారు. మనకు తెలీకుండా మనలో ప్రేమ పుట్టినప్పుడు మనకు ఆశ్చర్యం వేస్తుంది, ఆ ప్రేమ ఒక వ్యక్తి ద్వారా పుట్టిందని తెలిసినప్పుడు ఆ వ్యక్తి కోసం ఎంత దూరమైనా వెళ్లాలనిపిస్తుందనే సస్పెన్స్ క్యూట్ లవ్ స్టొరీ ఇది..’’ అని అన్నారు. 

Updated Date - 2020-07-31T22:01:45+05:30 IST