షాకిస్తున్న విక్రమ్ లుక్

ABN , First Publish Date - 2020-08-08T18:18:18+05:30 IST

తెలుగు వారికి సుప‌రిచితుడైన తమిళ హీరో విక్ర‌మ్ కూడా అదే కోవ‌కే చెందుతారు. ఎందుకంటే ఈ హీరో వ‌య‌సు 54 ఏళ్లు. తాత కూడా అయ్యారు. కానీ లుక్‌, ఫిట్‌నెస్ విష‌యంలో మాత్రం కుర్ర హీరోల‌తో పోటీ ప‌డుతున్నారు.

షాకిస్తున్న విక్రమ్ లుక్

సాధారణంగా వయసు పెరిగే కొద్ది ఆ ప్ర‌భావం మ‌నిషిపై క‌న‌ప‌డుతుంది. లుక్ మారిపోతుంటుంది. కానీ కొంద‌రు హీరో, హీరోయిన్లు మాత్రం వ‌య‌సు విష‌యంలో కుర్ర హీరోల‌తో పోటీ ప‌డుతుంటారు. మ‌న తెలుగులో నాగార్జు అక్కినేని ఆ కోవ‌లోకి వ‌స్తారు. ఇప్పుడు తెలుగు వారికి సుప‌రిచితుడైన తమిళ హీరో విక్ర‌మ్ కూడా అదే కోవ‌కే చెందుతారు. ఎందుకంటే ఈ హీరో వ‌య‌సు 54 ఏళ్లు. తాత కూడా అయ్యారు. కానీ లుక్‌, ఫిట్‌నెస్ విష‌యంలో మాత్రం కుర్ర హీరోల‌తో పోటీ ప‌డుతున్నారు. లేటెస్ట్‌గా ఈయ‌న లుక్ ఒక‌టి సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతుంది. సిక్స్ ప్యాక్ లుక్‌లో ప‌క్క‌కు తిరిగి నిల‌బ‌డి ఉన్న విక్ర‌మ్ లుక్ చూస్తే షాకింగ్‌గా ఉంది. ఈ మ‌ధ్యే హీరోగాఎంట్రీ ఇచ్చిన ఆయ‌న తన‌యుడు ధ్రువ్‌కే విక్ర‌మ్ పోటీ ఇస్తున్నారే అని అందరూ అనుకుంటున్నారు ఈ లుక్ చూస్తే. ప్రస్తుతం విక్రమ్ ‘కోబ్రా’ సినిమాలో నటిస్తున్నారు. 

Updated Date - 2020-08-08T18:18:18+05:30 IST

Read more