క‌రోనా విరాళాల గొడ‌వ.. హీరో అభిమాని మృతి

ABN , First Publish Date - 2020-04-25T18:34:07+05:30 IST

త‌మిళ‌నాడులోని విలుపురంలో ఇద్ద‌రి హీరోల డైహార్డ్ ఫ్యాన్స్ మ‌ధ్య రేగిన గొడ‌వ వ‌ల్ల ఒక‌రు చ‌నిపోయారు.

క‌రోనా విరాళాల గొడ‌వ.. హీరో అభిమాని మృతి

అభిమానులందు క‌రుడుగ‌ట్టిన అభిమానులు వేర‌యా!.. ఎందుకో తెలుసా? అభిమానుల‌నే వారికి దాని ప‌రిధేంటో తెలుసు. కానీ క‌రుడుగ‌ట్టిన అభిమానుల‌కు అలాంటి హ‌ద్దులుండ‌వు. దీని వ‌ల్ల కొన్ని దుష్ప‌రిణామాలు జ‌రుగుతుంటాయి. త‌మిళ‌నాడులోని విలుపురంలో ఇద్ద‌రి హీరోల డైహార్డ్ ఫ్యాన్స్ మ‌ధ్య రేగిన గొడ‌వ వ‌ల్ల ఒక‌రు చ‌నిపోయారు. వివ‌రాల్లోకెళ్తే యువ‌రాజ్ అనే యువ‌కుడు త‌మిళ హీరో విజ‌య్‌, దినేష్ అనే యువ‌కుడు ర‌జినీకాంత్‌కు డైహార్డ్ ఫ్యాన్స్. రీసెంట్‌గా హీరోలు ప్ర‌క‌టించిన క‌రోనా విరాళాల గురించి ఇద్ద‌రి మ‌ధ్య పెద్ద గొడ‌వే జ‌రిగింది. ఆ గొడ‌వ‌లో దినేష్‌ త‌న స్నేహితుడు యువ‌రాజ్‌ను తోశాడు. కింద ప‌డ్డ యువ‌రాజ్‌ త‌ల‌కు గాయ‌మై చనిపోయాడు. స్నేహితుడు చ‌నిపోవడంతో దినేష్ భ‌యంతో పారిపోయాడు. పోలీసులు అత‌న్ని అరెస్ట్ చేసి కేసు న‌మోదు చేశారు. 

Updated Date - 2020-04-25T18:34:07+05:30 IST