సూర్య సినిమా ఓటీటీ రిలీజ్ వాయిదా
ABN , First Publish Date - 2020-10-23T03:17:28+05:30 IST
సూర్య నటిస్తూ, నిర్మించిన ‘సూరారై పొట్రు (తెలుగులో ‘ఆకాశం నీ హద్దురా’) చిత్రాన్ని అక్టోబర్ 30న అమెజాన్ ప్రైమ్ వీడియోలో నేరుగా విడుదల చేయాలని నిర్ణయించిన విషయం తెలిసిందే

సూర్య నటిస్తూ, నిర్మించిన ‘సూరారై పొట్రు (తెలుగులో ‘ఆకాశం నీ హద్దురా’) చిత్రాన్ని అక్టోబర్ 30న అమెజాన్ ప్రైమ్ వీడియోలో నేరుగా విడుదల చేయాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. థియేటర్లు ఎప్పుడు తెరుచుకుంటాయో తెలియని టైమ్‌లోనే.. సూర్య తన సహ నిర్మాత గునీత్ మోంగాతో కలిసి ఓటీటీ విడుదలపై నిర్ణయం తీసుకోవడం, విడుదల తేదీని ప్రకటించడం జరిగిపోయింది. అయితే ఈ చిత్రం అనుకున్న టైమ్‌కి అంటే.. అక్టోబర్ 30న ఓటీటీలో విడుదల కావడం లేదు. ఈ విషయం తెలియజేస్తూ.. హీరో సూర్య సోషల్ మీడియా వేదికగా ఓ లెటర్‌ను విడుదల చేశారు.
ఈ చిత్రం చెప్పిన టైమ్‌కి విడుదల కాకపోవడానికి కారణం ఇంకా కొందరి నుంచి అనుమతులు రాకపోవడమే అని సూర్య తెలిపారు. ఈ చిత్రం ఎయిర్ డెక్కన్ వ్యవస్థాపకుడు కెప్టెన్ గోపీనాథ్ జీవితంలో జరిగిన సంఘటనల ఆధారంగా తెరకెక్కిన విషయం తెలిసిందే. ఇది నేషనల్ సెక్యూరిటీకి సంబంధించిన విషయం. కావున వారి నుంచి ఇంకా కొన్ని అనుమతులు రావాల్సి ఉన్నాయని.. అందువల్లే చిత్రాన్ని వాయిదా వేస్తున్నట్లుగా తెలుపుతూ.. ప్రస్తుతానికి స్నేహానికి సంబంధించిన సాంగ్‌ని విడుదల చేసినట్లుగా సూర్య తెలిపారు. దయచేసి అందరూ ఈ సమస్యను అర్థం చేసుకుంటారని భావిస్తున్నట్లుగా సూర్య ఈ లెటర్‌లో పేర్కొన్నారు.
Read more