‘శ్రీదేవి సోడాసెంటర్’ అంటోన్న సుధీర్‌ బాబు

ABN , First Publish Date - 2020-10-30T22:22:51+05:30 IST

సుధీర్‌ బాబు హీరోగా నటించనున్న నూతన చిత్ర టైటిల్‌, ఫ‌స్ట్ లుక్ మోష‌న్ పోస్టర్‌ను శుక్రవారం విడుదల చేశారు. భ‌లే మంచి రోజు, ఆనందో బ్రహ్మా, యాత్ర వంటి చిత్రాలను

‘శ్రీదేవి సోడాసెంటర్’ అంటోన్న సుధీర్‌ బాబు

సుధీర్‌ బాబు హీరోగా నటించనున్న నూతన చిత్ర టైటిల్‌, ఫ‌స్ట్ లుక్ మోష‌న్ పోస్టర్‌ను శుక్రవారం విడుదల చేశారు. భ‌లే మంచి రోజు, ఆనందో బ్రహ్మా, యాత్ర వంటి చిత్రాలను తెలుగు ప్రేక్ష‌కుల‌కి అందించిన 70 ఎమ్ ఎమ్ ఎంట‌ర్‌టైన్మెంట్స్ బ్యానర్‌పై రూపొందనున్న ఈ చిత్రానికి 'శ్రీదేవి సోడాసెంట‌ర్' అనే టైటిల్‌ను ప్రకటించారు. స‌క్సెస్ ఫుల్ నిర్మాత‌లు విజయ్ చిల్లా, శశిదేవి‌రెడ్డి సంయుక్తంగా ప‌లాస 1978 వంటి సూప‌ర్ హిట్ క‌ల్ట్ మూవీని తెర‌కెక్కించిన హ్యాపెనింగ్ డైరెక్ట‌ర్ క‌రుణ కుమార్ ద‌ర్శ‌క‌త్వంలో 70 ఎమ్ ఎమ్ ఎంట‌ర్ టైన్మెంట్స్ బ్యాన‌ర్ పై ప్రొడ‌క్ష‌న్ నెం 4గా ఈ చిత్రం తెరకెక్కనుంది. 


నిర్మాత‌లు విజ‌య్ చిల్లా, శ‌శిదేవిరెడ్డి తీసిన తొలి చిత్రం 'భ‌లే మంచి రోజు'లో హీరోగా న‌టించి 70 ఎమ్ ఎమ్ ఎంట‌ర్‌టైన్మెంట్స్‌కి తొలి విజ‌యాన్ని అందించ‌డ‌మే కాకుండా త‌న ఖాతాలో కూడా సూప‌ర్ హిట్ వేసుకున్న సుధీర్ బాబు ఇప్పుడు శ్రీదేవి సోడా సెంట‌ర్ అంటూ మ‌రోసారి ఆ బ్యాన‌ర్ లో న‌టిస్తున్నారు. దాదాపు అయిదేళ్లు తరువాత‌ సుధీర్ బాబు ఈ బ్యాన‌ర్‌లో చిత్రం చేస్తున్నారు. ఈ మోష‌న్ పోస్ట‌ర్‌కి లీడ్ ఇస్తూ తాజాగా విడుద‌ల చేసిన ప్రీలుక్‌లో గోలీసోడాల కేస్, జిమ్కీలైట్లు, వైర్లు, మ‌ల్లెపూల వంటి ఎలిమెంట్స్ పెట్టి ఆడియెన్స్‌కి ఉత్కంఠ క‌లిగించిన చిత్ర యూనిట్‌.. ఇప్పుడు కూడా అదే పంధాని కొన‌సాగించారు. శ్రీదేవి సోడా సెంట‌ర్ మోష‌న్ పోస్ట‌ర్‌లో సుధీర్ బాబు సోడా ప‌ట్టుకొని ఉన్న స్టిల్ ఆకట్టుకునేలా ఉంది. ఈ సినిమాకి సంబంధించిన రెగ్యూల‌ర్ షూటింగ్ న‌వంబ‌ర్‌లో మొద‌లుపెడుతున్న‌ట్లుగా నిర్మాత‌లు విజ‌య్ చిల్లా, శ‌శిదేవిరెడ్డి తెలిపారు. మెలోడి కింగ్ మ‌ణిశ‌ర్మ ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నట్లుగా చిత్రయూనిట్‌ పేర్కొంది.



Updated Date - 2020-10-30T22:22:51+05:30 IST