తుది శ్వాస వరకు సినిమాలు చేయండి: రామ్‌

ABN , First Publish Date - 2020-04-20T15:05:26+05:30 IST

పూరి డైరెక్ట‌ర్‌గా 20 ఏళ్ల ప్ర‌యాణాన్ని పూర్తి చేసుకున్న సంద‌ర్భంగా రామ్ ట్విట్ట‌ర్ ద్వారా అభినందనలను తెలియజేశారు.

తుది శ్వాస వరకు సినిమాలు చేయండి:  రామ్‌

హీరోల‌ను మాస్ కోణంలో ఆవిష్క‌రిస్తూ సినిమాలు చేయగ‌ల ద‌ర్శ‌కుల్లో పూరి జ‌గ‌న్నాథ్ టాప్‌లో ఉంటారు. అగ్ర హీరోలంద‌రితోనూ ఆయ‌న ప‌నిచేశారు. ఈరోజు ఆయ‌న ద‌ర్శ‌కుడిగా జ‌ర్నీని స్టార్ట్ చేసి 20 ఏళ్ల‌వుతుంది. ఈ సంద‌ర్భంగా ప‌లువురు ఆయ‌న‌కు సోష‌ల్ మీడియా మాధ్య‌మాల ద్వారా అభినంద‌న‌లు తెలియ‌జేస్తున్నారు. పూరి జ‌గన్నాథ్ గ‌త చిత్రం ‘ఇస్మార్ట్ శంక‌ర్’ భారీ విజయాన్ని సాధించిన సంగ‌తి తెలిసిందే. ఇందులో రామ్ పోతినేని హీరో. పూరి డైరెక్ట‌ర్‌గా 20 ఏళ్ల ప్ర‌యాణాన్ని పూర్తి చేసుకున్న సంద‌ర్భంగా రామ్ ట్విట్ట‌ర్ ద్వారా ‘‘సినిమా ఒక క‌ళ‌. ఆ క‌ళ‌ను మీరు పొందారు.. ఎంజాయ్ చేశారు. ఊపిరిగా జీవిస్తున్నారు. మీ తుది శ్వాస వ‌ర‌కు సినిమానే ఊపిరిగా ఉండాల‌ని మా కోరిక‌. ల‌వ్ యు సార్‌’’ అని అభినంద‌నలు తెలిపారు. రామ్ ట్వీట్‌కు ‘‘నా చివరి శ్వాస వరకు సినిమానే ఊపిరిగా జీవిస్తాను. మాకీ కిరికిరి’’ అంటూ పూరి స్పందించారు.

Updated Date - 2020-04-20T15:05:26+05:30 IST