ఎన్ని ఓటీటీ వేదికలున్నా థియేటర్‌ థియేటరే: రామ్‌

ABN , First Publish Date - 2020-12-25T00:04:30+05:30 IST

'ఇస్మార్ట్ శంకర్'తో థియేటర్ల వద్ద పండగ వాతావరణం సృష్టించిన యంగ్‌ అండ్‌ ఎనర్జిటిక్‌ హీరో రామ్‌.. ఈ సంక్రాంతి పండక్కి 'రెడ్' చిత్రంతో థియేటర్లలోకి వచ్చేందుకు రెడీ

ఎన్ని ఓటీటీ వేదికలున్నా థియేటర్‌ థియేటరే: రామ్‌

'ఇస్మార్ట్ శంకర్'తో థియేటర్ల వద్ద పండగ వాతావరణం సృష్టించిన యంగ్‌ అండ్‌ ఎనర్జిటిక్‌ హీరో రామ్‌.. ఈ సంక్రాంతి పండక్కి 'రెడ్' చిత్రంతో థియేటర్లలోకి వచ్చేందుకు రెడీ అవుతున్నాడు. రామ్ సరసన నివేదా పేతురాజ్‌, మాళవికా శర్మ, అమృతా అయ్యర్‌ హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రం నుండి ఇటీవల విడుదలైన 'కౌన్ హే అచ్చా‌... కౌన్ హే లుచ్చా' పాట సహా అంతకుముందు విడుదలైన పాటలు మంచి స్పందనను రాబట్టుకున్న విషయం తెలిసిందే. మెలోడీ బ్రహ్మ మణిశర్మ ఈ చిత్రానికి సంగీతం అందించగా.. నిర్మాత 'స్రవంతి' రవికిశోర్ ఈ చిత్రాన్ని స్రవంతి మూవీస్ పతాకంపై సంక్రాంతికి విడుదల చేస్తున్నారు. తాజాగా ఈ చిత్ర ట్రైలర్‌ను చిత్రయూనిట్‌ విడుదల చేసింది.


ట్రైలర్‌ విడుదల కార్యక్రమంలో హీరో రామ్ మాట్లాడుతూ.. ''ఇంట్లో పూజ గది ఉన్నా గుడికే వెళతాం, వంట చేసుకోగలిగినా హోటల్‌కి వెళతాం, అలాగే ఎన్ని ఓ.టి.టి వేదికలున్నా థియేటర్లకే వచ్చి సినిమాలు చూస్తాం, ఆ అనుభూతే పూర్తిగా వేరుగా ఉంటుంది. ఇలా థియేటర్ లో మళ్ళీ ట్రైలర్ ని చూడడం చాలా కొత్తగా అనిపిస్తుంది. ఇన్ని రోజుల విరామం, వాయిదాలు, కష్టాలు అన్నీ మర్చిపోతాం. థియేటర్లలో చిత్రం చూస్తూ ఒక కొత్త ప్రపంచంలోకి వెళ్ళిపోతాం. అలాంటి అనుభూతి అందరికి ఇవ్వాలనే చాలా గట్టిగా నిర్ణయించుకున్నారు స్రవంతి రవి కిషోర్ గారు. కిషోర్ తిరుమల, సమీర్ రెడ్డి గారి లాంటి ప్రతిభ ఉన్న టెక్నీషియన్స్ కి ఒక కొత్త జానర్ ఇస్తే ఎలా తీస్తారో అని నాకొచ్చిన సందేహాన్ని పూర్తిగా మార్చేసి వేరే లెవెల్ కంటెంట్ ని విజువల్స్ ని ఇచ్చారు. ఇందులో ఉన్న పోలీస్ రోల్ కి నివేదా పేరురాజ్ సరిగ్గా సరిపోతుంది అని అందరికి అనిపించినట్టే తాను చాలా బాగా చేసింది. మాళవిక శర్మ, అమృతా అయ్యర్ లు పాత్రకి తగ్గట్టుగా అద్భుతంగా నటించారు. అలాగే ప్రేక్షకులందరూ జాగ్రత్తగా ఉంటూనే థియేటర్లకు రావాలని కోరుతున్నాము.. ఎందుకంటే జాగ్రత్త - జాగ్రత్తే, ఎంటర్టైన్మెంట్ - ఎంటెర్టైన్మెంటే.." అని అన్నారు.

Updated Date - 2020-12-25T00:04:30+05:30 IST